సచివాలయ ఉద్యోగులతో నిరసన ర్యాలీ

ABN , First Publish Date - 2021-06-25T06:43:59+05:30 IST

ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి నేతృత్వంలో గురువారం పట్టణంలో సచివాలయ ఉద్యోగు లు, వలంటీర్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు.

సచివాలయ ఉద్యోగులతో నిరసన ర్యాలీ
రాయదుర్గంలో ప్రభుత్వ విప్‌ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకి హాజరైన సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు

రాయదుర్గం టౌన్‌/కళ్యాణదుర్గం, జూన 24 : ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి నేతృత్వంలో గురువారం పట్టణంలో సచివాలయ ఉద్యోగు లు, వలంటీర్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం  నుంచి ప్రారంభమైన ర్యాలీ అర్‌అండ్‌బీ అతిథి గృహం, లక్ష్మీబజార్‌, పెట్రో ల్‌ బంక్‌, జడ్పీ బాలికోన్నత పాఠశాల, పాత బస్టాండ్‌, గాంధీ సర్కిల్‌ మీ దుగా వినాయక సర్కిల్‌ వరకు కొనసాగింది. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన పొరాళ్ళ శిల్ప, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్ర రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీ కి సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు హాజరయ్యారు. వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి టీసర్కిల్‌ వరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో కలిసి ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చెర్మన జయం ఫణీంద్ర, మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన బిక్కినాగలక్ష్మీ హరి పాల్గొన్నారు. ఇదిలాఉండగా నిరసన ర్యాలీల్లో ప్రభుత్వ ఉద్యోగులైన సచివాలయ ఉద్యోగులు పాల్గొనడం విమర్శలపాలైంది. గంటల తరబడి ర్యాలీకి ఉద్యోగు లు హాజరుకావడంతో సచివాలయాల వద్దకు వివిధ పనుల నిమిత్తం వ చ్చిన ప్రజలు నిరీక్షించాల్సి వచ్చింది. 

Updated Date - 2021-06-25T06:43:59+05:30 IST