Abn logo
Sep 20 2021 @ 23:26PM

భూకబ్జాలపై నిరసన

తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న ప్రజలు మహిళలు

సిద్దవటం, సెప్టెంబరు20 : సిద్దవటం మండలం పెద్దపల్లె పంచాయతీ సర్వే నెంబరు 937లో అక్రమాలు పెరిగిపోతున్నాయని వాటిని వెంటనే ఆపి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని మాధవరం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ జానకి రామయ్య, గ్రామంలోని పలువురు మహిళలు సిద్దవటం తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరనస చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామ సర్పంచ్‌ మాట్లాడుతూ పెద్దపల్లె పంచాయతీ రెవెన్యూ పొలంలో 937సర్వేనెంబరులో రోజురోజుకు భూకబ్జాలు పెరిగిపోతున్నాయన్నారు. కానీ వీఆర్వో కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది దళిత, పేద రైతులకు 7వ విడత భూ పంపిణీ పథకం కింద దళితులకు పట్టాలు పంపిణీ చేశారన్నారు. కాగా అవి కూడా కబ్జా చేసి కంచె వేస్తున్నారన్నారు. ఈ విషయంపై విచారణ చేపట్టి భూఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దారు రమాకుమారికి వినతిపత్రం సమర్పించారు.  ఈ కార్యక్రమంలో మాధవరం గ్రామం మహిళలు తదితరులు పాల్గొన్నారు.