పెట్రో ధరల పెంపుపై భగ్గు

ABN , First Publish Date - 2021-06-19T07:10:06+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించి ప్రజలను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై రవీంద్రబాబు డిమాండ్‌ చేశారు.

పెట్రో ధరల పెంపుపై భగ్గు
కనిగిరిలో ఆటోను లాగి నిరసన తెలుపుతున్న సీపీఐ శ్రేణులు

వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు 

నిత్యావసర ధరల పెరుగుదలపై ఆందోళన  

కనిగిరి, జూన్‌ 18 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించి ప్రజలను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై రవీంద్రబాబు డిమాండ్‌ చేశారు. ధరల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా కనిగిరిలో శుక్రవారం ఆటోలను తాడుతో లాక్కెళుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ 102 మంది మోడీ శిష్య బృందం బ్యాంకులను లూటీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక నేరగాళ్ల చేతుల్లోకి దేశం వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్‌ లీటర్‌ను రూ.31.82 దిగుమతి చేసుకొని ప్రస్తుతం రూ.102కు విక్రయిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.70 వరకు పన్నులు వసూలు చేస్తున్నాయన్నారు. సత్వరమే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రజలతో కలసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు యాసిన్‌, జీ.పీ.రామారావు, జిలాని, బాలకోటయ్య, ప్రభాకర్‌, మీరావలి, నాజర్‌, కిరణ్‌, వెంకటేశ్వర్లు, అమృల్లా, వెలుగొండయ్య, ప్రసాద్‌, సుబ్బారావు, అంకమ్మ, సుబ్బమ్మ, రమణమ్మ, ఆచారి, భారతి, కోటయ్య, సుబ్బారావు, రామయ్య, జి తిరుపాలు, షరీఫ్‌, ఖాదర్‌మస్తాన్‌, వివిధ ప్రజా సంఘాలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం స్థానిక పామూరు బస్టాండ్‌ కూడలిలో మానవహారం నిర్వహించి  ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు.

సీఎ్‌సపురం : పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో శుక్రవారం సీపీఎం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు, పార్టీ కార్యకర్తలు రాజ్యలక్ష్మి, లక్ష్మయ్య, నారాయణ, రాజు, రమణమ్మ, షాను నాగేశ్వరరావు, నూరు బాషా, రమణయ్య, ఆదయ్య తదితరులు పాల్గొన్నారు.

గుడ్లూరు : సామాన్య, మధ్య తరగతి పేదల నడ్డివిరుస్తూ అమాంతం పెంచుకుంటూ పోతున్న పెట్రోల్‌, డీజిల్‌, నిత్యవసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా నాయకులు గంటెనపల్లి వెంకటేశ్వర్లు కోరారు. సీపీఎం, సీఐటీయూ, ఆటోవర్కర్స్‌ యూనియన్‌ల నేతృత్వంలో గుడ్లూరు హైస్కుల్‌ సెంటర్‌ నుంచి బస్టాండ్‌ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్సి మద్దిశెట్టి జాలయ్య, సీఐటీయూ నాయకులు కొట్టే వెంకయ్య, ఎం. వెంకటేశ్వర్లు, పాలకీర్తి నాగేశ్వరరావు, పి. రామచంద్రయ్య, బొక్కా వెంకట్రావు,   విద్యుత్‌ ఉద్యోగుల సంఘం డివిజన్‌ నాయకులు రవికుమార్‌ పాల్గొన్నారు.

వలేటివారిపాలెం : పెంచిన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం గుడ్లూరు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి కుమార్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం ముందు సీపీఎం నాయకులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాదు చెన్నకేశవులు, పర్రె భాస్కర్‌రావు, వెంకటేశ్వర్లు, శివ సుభాషిణి, జయమ్మ, కొండమ్మ, వరలక్ష్మీ పాల్గొన్నారు.

టంగుటూరు : పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యకర్తలు టంగుటూరులోని ఎస్‌బీఐ సెంటర్‌ వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు టి.రాము మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ పెట్రోల్‌ ధరలు పదేపదే పెంచడం ద్వారా  ప్రభుత్వం రవాణారంగం, వ్యవసాయ రంగంలోని కార్మికుల పొట్టలు కొడుతోందని విమర్శించారు కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మోజెస్‌  కాలేషాబేగ్‌, టి.సుబ్బారావు, శ్రీనివాస్‌, యానాది, అంకయ్య పాల్గొన్నారు. 

కొండపి : రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా సీపీఎం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కొండపిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు కేజీ మస్తాన్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ కార్పొరేట్‌లకు దేశాన్ని ధారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో యేసు, కరీం, వెంకట సుబ్బులు, సునీత, జయరావు పాల్గొన్నారు. 

పామూరు : కరోనా లాక్‌డౌన్‌వలన పనులు కోల్పోయి ఇంటి వద్దనే ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజానీకంపై పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ భారాలు మోపడం మోడీకి తగదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ అన్నారు. పెంచిన ఆయిల్‌,  నిత్యావసర సరుకులు ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్థానిక ‘మమ్మీ- డాడీ’ కూడలిలో శుక్రవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు రాయితీలు ప్రకటిస్తూ సామన్యులపై భారాన్ని మోపుతోందన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి త్వరలో ప్రజలు చరమగీతం పాడుతారన్నారు. వ్యాక్సినేషన్ను అందుబాటులోకి తెచ్చి ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎస్‌డీ మౌలాలి, వజ్రాల సుబ్బారావు, పాలపర్తి మస్తాన్‌, ఆర్‌ సూరిబాబు, ఆకుల మోహన్‌రావు, ఎన్‌.సీతారామయ్యతో పాటు సీపీఎం నాయకులు కె మాల్యాద్రి, షేక్‌ ఖాదర్‌బాషా, అల్లా భగష్‌, బి.మహదేవయ్యతో పాటు వార్డు మెంబర్లు ఇస్మాయిల్‌ పాల్గొన్నారు. 

వెలిగండ్ల : పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని సీపీఎం ప్రాంతీయ కన్వీనర్‌ బడుగు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక పెట్రోల్‌ బంక్‌ ఆవరణలో సీపీఎం ఆఽధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 2014లో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి  పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు.  కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు రాయళ్ల మాలకొండయ్య, బొబ్బా శ్రీను, ఎం అంకిరెడ్డి, పుల్లయ్య, వినోద్‌, మాలకొండయ్య, పాల్గొన్నారు. 

దర్శి  : పెట్రోలు, డీజల్‌ ధరలు తగ్గించాలని సీపీఐ, సీిపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం దర్శిలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఆయా పార్టీల కార్యదర్శులు టి.రంగారావు, మాడపాకుల సురేష్‌ మాట్లాడుతూ పెట్రోలు, డీజల్‌ ధరలు పెరగటం వలన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు జె.కోటేశ్వరరావు, హనుమంతరావు, అరుణ, వెంకటేశ్వర్లు, సీపీఎం నాయకులు సందు వెంకటేశ్వరరావు, షేక్‌ బాషా, యు.నారాయణ, ఈ నాగేశ్వరరావు, కె.వి.పిచ్చయ్యలు పాల్గొన్నారు.

ముండ్లమూరు : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ముండ్లమూరులోని బస్టాండ్‌ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెల్లంపల్లి ఆంజనేయులు, బోడపాటి హనుమంతరావు, మీరావలి, సత్యం పాల్గొన్నారు. 

కందుకూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుల నడ్డివిరిచేలా పన్నులు విధిస్తున్నాయని సీపీఎం, సీపీఐ నాయకులు విమర్శించారు. పెరిగిన పెట్రోలు, డీజిల్‌, నిత్యావసరాల ధరలకు నిరసనగా శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు ఓ. రామకోటయ్య, పి. మాలకొండయ్య, బి.సురేష్‌బాబు, పి.బాలకోటయ్య, ఎస్‌ఏ గౌస్‌, వెంకటరావు, సుభాను, హరిబాబు, బాలబ్రహ్మాచారి పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-19T07:10:06+05:30 IST