హత్యాచార దోషిని శిక్షించాలి

ABN , First Publish Date - 2021-09-16T05:22:50+05:30 IST

హత్యాచార దోషిని శిక్షించాలి

హత్యాచార దోషిని శిక్షించాలి
గణపురంలో కొవ్వొత్తులతో ర్యాలీ

గణపురం, సెప్టెంబరు 15: చిన్నారిని హత్యాచారం చేసిన దోషిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బుధవారం కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించారు. అంబేద్కర్‌ యువజన సంఘం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్‌, ఓరుగంటి కృష్ణ, దుర్గయ్య, సతీష్‌, చిలువేరు ఉదయాకర్‌, ఇంజంపల్లి శంకర్‌  తదితరులు పాల్గొన్నారు.

 గోవిందరావుపేట : హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన   వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం రాత్రి మండలంలోని పస్రాలో నాయకులు 163వ జాతీయ రహదారిపై  కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్‌, నాయకులు బద్దం లింగారెడ్డి, కొల్లు శ్రీనివాసరెడ్డి, నాయకులు రస్పూత్‌ సీతారాం నాయక్‌, పెండెం శ్రీకాంత్‌, కొంపెల్లి శ్రీనివాసరెడ్డి, పాలడుగు వెంకటకృష్ణ, జాటోత్‌ చంద్రకాంత్‌, చెరుకుల సురేష్‌, కొర్ర శ్రీను, పంగ శ్రీను, తోకల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

 మల్హర్‌ : చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన కిరాతకుడిని కఠినంగా శిక్షించాలని సేవాలాల్‌ సేన భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల కన్వీనర్‌ అంగోత్‌ రాజునాయక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తాడిచర్లలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఉదంతం జరిగి ఐదు రోజులవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-09-16T05:22:50+05:30 IST