విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2022-10-04T06:35:41+05:30 IST

: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరణను నిరసిస్తూ గత నాలుగు రోజులుగా పుదుచ్చేరి విద్యుత్‌ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా సోమవారం ఎస్‌ఈ కార్యాలయ ఆవరణలో విద్యుత్‌ ఉద్యోగులు నిరసన తెలిపారు.

విద్యుత్‌ ఉద్యోగుల నిరసన
ఎస్‌ఈ కార్యాలయ ఆవరణలో నిరసన తెలుపుతున్న విద్యుత్‌ ఉద్యోగులు

గణేశ్‌నగర్‌, అక్టోబరు 3: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరణను నిరసిస్తూ గత నాలుగు రోజులుగా పుదుచ్చేరి విద్యుత్‌ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా సోమవారం ఎస్‌ఈ కార్యాలయ ఆవరణలో విద్యుత్‌ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా సమ్మె చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులను పుదుచ్చేరి ప్రభుత్వం అరెస్టు చేయడం సరికాదని, వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, లేనియెడల దేశవ్యాప్త సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్‌ సవరణ బిల్లును, పుదుచ్చేరిలో ప్రైవేటీకరణ దిశలో పిలిచిన టెండర్లను వెంటను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కామ అంజయ్య, ఎస్‌ఈ గంగాధర్‌, నాయకులు అంజయ్య, వీరయ్య, కే శ్రీనివాస్‌, యుగంధర్‌, భాస్కర్‌, సంపత్‌కుమార్‌, స్వామి, వెంకటేశ్వర్‌ఆరవు, అనిల్‌, మునీందర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-04T06:35:41+05:30 IST