జిల్లాలో విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2022-08-09T05:39:32+05:30 IST

కేంద్రప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్‌ప్రైవేట్‌ బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జేఏసీ పిలుపుమేరకు విద్యుత్‌ ఉద్యోగులు నిరసన తెలిపారు.

జిల్లాలో విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

కామారెడ్డి, ఆగస్టు 8: కేంద్రప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్‌ప్రైవేట్‌ బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జేఏసీ పిలుపుమేరకు విద్యుత్‌ ఉద్యోగులు నిరసన తెలిపారు. వీరికి కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డితో పాటు నాయకులు మద్దతు పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌శాఖ ప్రైవేటీకరణ బిల్లును ఆపకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

బాన్సువాడలో..

బాన్సువాడ టౌన్‌ : పట్టణంలోని విద్యుత్‌ కార్యాలయం ముందు సోమవారం ఉద్యోగులు విద్యుత్‌ ప్రైవేటీకరణ బిల్లుపై నిరసన తెలిపారు. విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం విద్యుత్‌ ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని, పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రమోద్‌ రెడ్డి, సాయిరాం, మురళి, అరవింద్‌, తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-08-09T05:39:32+05:30 IST