నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ABN , First Publish Date - 2021-10-19T05:27:40+05:30 IST

యూపీలోని లఖీంపూర్‌ వద్ద దీక్ష చేస్తున్న వారిపై కారు ఎక్కించి నలుగురు రైతుల మృతికి కారకుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

నిందితుడిని కఠినంగా శిక్షించాలి
గద్వాల రైల్వే స్టేషన్‌ ముందు నిరసన తెలుపుతున్న నాయకులు

- అఖిలపక్షం, ప్రజాసంఘాల డిమాండ్‌

- గద్వాల రైల్వే స్టేషన్‌ ముందు నిరసన

గద్వాల అర్బన్‌/అయిజ/రాజోలి, అక్టోబరు 18 : యూపీలోని లఖీంపూర్‌ వద్ద దీక్ష చేస్తున్న వారిపై కారు ఎక్కించి నలుగురు రైతుల మృతికి కారకుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఆశిష్‌మిశ్రాను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల వెంకటయ్య డిమాండ్‌ చేశారు. రైతుల ప్రాణాలను బలితీసుకున్న నిందితులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాల ఉదాసీనతను నిరసి స్తూ అఖిలభారత రైతు సంఘాల సమాఖ్య పిలుపుమేరకు సోమవారం అఖిలపక్షం, ప్రజాసంఘాల నాయకులు గద్వాల రైల్వేస్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ సంఘట నపై సమగ్ర జరిపించాలని, కేంద్ర మంత్రిని పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. కార్య క్రమంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్య దర్శులు ఆంజనేయులు, వెంకటస్వామి, బీఆర్‌ఎస్‌ నాయ కులు వాల్మీకి, వినోద్‌కుమార్‌, రైతు సంఘాల నాయకులు గోపాల్‌రావు, కృష్ణయ్య, గోపాల్‌ యాద వ్‌, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ ఇక్బాల్‌ పాషా, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ రాష్ట్ర కోశా ధికారి శంకర ప్రభాకర్‌, సీసీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకుడు రాజు పాల్గొన్నారు. 


- అయిజ పట్టణంలోని కొత్తబస్టాండు ముందు సోమవారం కేంద్ర సహయమంత్రి కుమారుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌, ఉపాధ్యక్షుడు బత్తలయ్య, ప్రదీప్‌, చిన్న, వినోద్‌, నవదీప్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్‌, ఉపాధ్యక్షుడు శ్రీను, కోశాధికారి నాగరాజు పాల్గొన్నారు.


- రాజోలి మండలంలోని తూర్పు గార్లపాడు గ్రామంలో సోమవారం సీపీఎం నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి విజయ్‌ కుమార్‌, దేవరాజు, సభ్యులు జమ్మన్న, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T05:27:40+05:30 IST