Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిరసన హోరు

 పీఆర్సీ ప్రకటించాలి  

రెవెన్యూ  కార్యాలయాలు, పాఠశాలల వద్ద ఉద్యోగులు, టీచర్ల ధర్నా  


(ఆంధ్రజ్యోతి బృందం)

పీఆర్సీ అమలుతో పాటు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఔట్‌సోర్సింగ్‌, పింఛనర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ పిలుపు మేరకు రెవెన్యూ కార్యాలయాలతో పాటు పాఠశాలల ఎదుట రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీఆర్సీ, డీఏ బకాయిలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 


Advertisement
Advertisement