అల్లూరి విప్లవ స్ఫూర్తితో ఢిల్లీకి

ABN , First Publish Date - 2021-01-21T04:13:24+05:30 IST

అల్లూరి సీతారామరాజు విప్లవ స్ఫూర్తితో ఢిల్లీ పోరాటానికి వెళుతున్నట్లు కేవీపీఎస్‌ ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు తెలిపారు.

అల్లూరి విప్లవ స్ఫూర్తితో ఢిల్లీకి
మోగల్లులో అల్లూరి విగ్రహానికి పూలమాల వేస్తున్న క్రాంతిబాబు

పాలకోడేరు, జనవరి 20: అల్లూరి సీతారామరాజు విప్లవ స్ఫూర్తితో ఢిల్లీ పోరాటానికి వెళుతున్నట్లు కేవీపీఎస్‌ ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న లక్షలాది రైతుల పోరాటానికి సంఘీభావంగా వలంటీర్లుగా జిల్లా నుంచి వెళుతున్న బృందానికి కె.క్రాంతిబాబు నాయక త్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం మోగల్లులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో వ్యవసాయం నాశనం చేయడానికి మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేస్తుందన్నారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డి.పెద్దిరాజు, కె.సూర్య, పి.వాసు, మోహన్‌, చంటిబాబు, కేవీపీఎస్‌ నాయకులు బత్తుల విజయకుమార్‌, ఉన్నమట్ల ప్రసాద్‌ తదితరులు ఉన్నారు. 


యలమంచిలి: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో దీక్ష చేస్తున్న రైతులకు సీఐటీయూ మద్దతు పలికింది. యలమంచిలి రైతు భరోసా కేంద్రం వద్ద బుధవారం అంగన్‌వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బాతి రెడ్డి జార్జి మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. దేవ సుధాకర్‌, బి.రజని, జీ మాధవి, టి.భవాని, బి.మాణిక్యం, కె.యమున, ఎంవీఎస్‌.లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T04:13:24+05:30 IST