కోనసీమ విధ్వంసం దోషులను శిక్షించాలి

ABN , First Publish Date - 2022-05-27T05:29:01+05:30 IST

కోనసీమలో విధ్వంసానికి పాల్పడి, మంత్రి విశ్వరూప్‌ ఇంటిని దగ్ధం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని వీరవాసరం మండల దళిత ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది.

కోనసీమ విధ్వంసం దోషులను శిక్షించాలి
వీరవాసరంలో వినతిపత్రం అందజేస్తున్న దళిత ఐక్య వేదిక నాయకులు

వీరవాసరం, మే 26: కోనసీమలో విధ్వంసానికి పాల్పడి, మంత్రి విశ్వరూప్‌ ఇంటిని దగ్ధం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని వీరవాసరం మండల దళిత ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది. ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం నిరసనగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీ ల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడని కోరారు. ఎన్‌జి.సుందరరాజు, చికిలే మంగతాయారు, కాటం స్టాన్లీరాజు, బొం తు రమేష్‌, చిక్కాల రాజు, ఎస్‌ శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.


అంబేడ్కర్‌ కోనసీమ పేరును కొనసాగించాలి

భీమవరం అర్బన్‌: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలని, ప్రజా ప్రతినిధుల ఇల్లు దగ్ధం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మాల మహానాడు అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్‌ డిమాండ్‌ చేశారు. భీమవరం ప్రకాశంచౌక్‌లో గురువారం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలువేసి నివాళులర్పించారు. పుష్పరాజ్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌, పొట్టి శ్రీరాములు, అ ల్లూరి సీతారామరాజు, పుట్టపర్తి సాయిబాబా పేర్లను కొన్ని జిల్లాలకు పెట్టినప్పుడు దళితులు ఎవరు వ్యతిరేకించలేదన్నారు. కోనసీమ జిల్లాకు అంబే డ్కర్‌ పేరు పెడితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గుండె సురేష్‌, సోడదాసి శ్రీధర్‌, బల్ల త్రిముర్తులు, మేడిశెట్టి లావరాజు, గొర్ల గోపి, జానుబాబు, విప్పర్తి పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T05:29:01+05:30 IST