అమరావతి: సచివాలయంలో రెండో రోజు ఆర్థికశాఖ ఉద్యోగులు నిరసనకు దిగారు. నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగిన ఉద్యోగులు, ర్యాలీ చేశారు. ఆర్థికశాఖ ఉద్యోగుల సీనియార్టీని ఫైనల్ చేయకపోవడంపై ఆందోళనకు దిగారు. సచివాలయంలో ఆర్థిక శాఖ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టులో ఆర్థిక శాఖ ఉద్యోగుల సీనియార్టీ ఫైనల్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలు అమలుకాకపోవడంతో ఆర్థిక శాఖ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. 2016 నుంచి ఇప్పటివరకు ఆర్థిక శాఖలో ఉద్యోగుల సీనియార్టీని ఉన్నతాధికారులు ఫైనల్ చేయలేదు. ఎనిమిది మిడిల్ లెవల్ పోస్టులు భర్తీ చేయడంలోఅధికారుల జాప్యం చేస్తున్నారు. జాప్యంతో ఉన్నతాధికారులకు ఉద్యోగులకు సమన్వయం కొరవడింది.