గుంటూరు: జిల్లాలోని కొల్లిపర (మ) అత్తలూరివారి పాలెం ఇసుక రీచ్ వద్ద కూలీలు ఆందోళన చేశారు. జేపీ కంపెనీ ప్రతినిధుల తీరుకు నిరసనగా లారీ డ్రైవర్లు, కూలీల ధర్నా చేశారు. సీరియల్ లేకుండా అధికంగా డబ్బులు ఇచ్చిన వారికే లోడింగ్ చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.