పీఆర్సీపై నిరసన

ABN , First Publish Date - 2022-01-19T05:20:43+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీని ని రసిస్తూ కందుకూరులో ఫ్యాప్టో ఆధ్వర్యంలో మంగళవారం సాయం త్రం ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

పీఆర్సీపై నిరసన
కందుకూరు పోస్టాఫీసు సెంటర్‌లో జీవో ప్రతులను దహనం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు

 ప్రభుత్వ జీవో ప్రతుల దహనం

కందుకూరు, జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీని ని రసిస్తూ కందుకూరులో ఫ్యాప్టో ఆధ్వర్యంలో మంగళవారం సాయం త్రం ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.  సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుండి పోస్టాఫీసు సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రతులను దహనం చేశారు. ఈ సంద ర్భంగా ఉపాధ్యాయసంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రప్రభు త్వం ఇటీవల విడుదల చేసిన 23 శాతం ఫిట్‌మెంట్‌ పీఆర్సీ జీవోను తక్షణం రద్దుచేసి 30 శాతం ఫిట్‌మెంట్‌తో జీతాలు పెంచాలని, హెచ్‌ ఆర్‌ఏ నూతన శ్లాబుని రద్దుచేసి పాత శ్లాబులను అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు ఎస్‌డీ మునీర్‌,  ఎం.కోటేశ్వరరావు, జి.సతీష్‌, ఎ. వెంకటేశ్వర్లు, తలారి సుబ్బారావు, దాసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

కనిగిరి: రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేయనున్న చీకటి పీఆర్సీని వెంటనే రద్దు చేయాలని ఫ్యాప్టో నాయకులు ప్రేమ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక సుగుణావతమ్మ ఆసుపత్రి సెంటర్‌లో ప్యా ఫ్టో ఆద్వర్యంలో మంగళవారం రాత్రి జరిగిన నిరసన ధర్నా కార్య క్రమంలో ఆయన మాట్లాడారు.  అనంతరం పీఆర్సీ జీవోల కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఆంటోని, ఎన్‌ రామచంద్రారెడ్డి, ఎస్‌కె ఖాజారహంతుల్లా తదితరులు పాల్గొన్నారు. 

పామూరు:  పీఆర్సీని నిరసిస్తూ ఉపాధ్యాయులు ఎమ్మార్సీ కార్యాల యం వద్ద జీవో ప్రతులను దహనం చేశారు.

ముండ్లమూరు: పీఆర్సీని నిరసిస్తూ ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌ యూనియన్‌ల ఆధ్వర్యంలో పాఠశాల మధ్యాహ్న భోజన సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అ లాగే, యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌, బీటీఏ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు మంగళవారం సాయంత్రం స్థానిక ఎంఈవో కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ఽధరించి కొత్త పీఆర్‌సీ జీవో కాపీలను దహనం చేశారు. 

దొనకొండ: పీఆర్‌సీపై అసంబద్ధ జీవోలకు వ్యతిరేకంగా మం గళవారం యుటీఎఫ్‌ కార్యాలయం నుండి రైల్వేస్టేషన్‌వరకు నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్కడ ప్రభుత్వ జీవోలను దహనం చేశారు.  

దర్శి: పాత పీఆర్‌సీ కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ మంగళ వారం సాయంత్రం దర్శి పట్టణంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేశారు. గడియార స్తంభం సెంటర్‌లో నూతన పీఆర్‌సీ ప్రతు లను దహనం చేశారు. 

సీఎస్‌పురం: స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో పీఆర్‌సీకి వ్యతిరేకంగా జీవో పత్రాలను దహనం చేశారు. 

గుడ్లూరు: పీఆర్సీని నిరసిస్తూ గుడ్లూరులో ఉపాధ్యాయులు జీవో ప్రతులను దహనం చేశారు. ఈనెల 20న కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్ర మం జయప్రదం చేయాలని ఈ సందర్భంగా యూనియన్‌ నాయ కులు కోరారు. 

తాళ్లూరు: ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీని వ్యతిరేకిస్తూ  బొద్దికూరపాడు జడ్పీ ఉపాధ్యాయులు  నిరసన చేపట్టారు. 

ఉలవపాడు:  పీఆర్సీని నిరసిస్తూ ఉపాధ్యాయులు ఉలవపాడులో నిరసన తెలిపారు. ఎమ్మార్సీ నుంచి అంబేద్కర్‌ బొమ్మ సెంటర్‌ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం చేపట్టారు.  

Updated Date - 2022-01-19T05:20:43+05:30 IST