పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై నిరసన

ABN , First Publish Date - 2021-10-29T04:56:42+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంచడాన్ని నిరసిస్తూ ది ఆంధ్రప్రదేశ్‌ లారీ ఆపరేటర్స్‌, ఓనర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు విశాఖపట్నం లారీ ఆపరేటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం పోర్టు గొడౌన్స్‌ ఏరియాలో నిరసన చేపట్టారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై నిరసన
నిరసన చేపడుతున్న లారీ ఆపరేటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

మల్కాపురం, అక్టోబరు 28 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంచడాన్ని నిరసిస్తూ ది ఆంధ్రప్రదేశ్‌ లారీ ఆపరేటర్స్‌, ఓనర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు విశాఖపట్నం లారీ ఆపరేటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం పోర్టు గొడౌన్స్‌ ఏరియాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దాదాపుగా 700 లారీలను నిలిపివేశారు. పెట్రో ఉత్పత్తులపై వసూలు చేస్తున్న రోడ్డు సెస్‌ను రద్దు చేయాలని, పెట్రో ఉత్పత్తులపై ప్రభుత్వం పన్ను తగ్గించాలని, థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియంను తగ్గించాలని, టోల్‌ గేటు రుసుము  నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పీకేబీ శేఖర్‌, కార్యదర్శి కె.అర్జున్‌రావు, కోశాధికారి లక్ష్మీనారాయణతో పాటు లారీ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు. అలాగే మల్కాపురం ప్రధాన కూడలిలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో పెట్రోల్‌, డీజీల్‌, వంట గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన చేశారు. మల్కాపురం ప్రధాన కూడలిలో వామపక్షాల నాయకులు రాస్తారోకో చేయడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Updated Date - 2021-10-29T04:56:42+05:30 IST