ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన

ABN , First Publish Date - 2020-10-02T08:30:30+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏలేశ్వరంలో సీసీఐ(ఎంఎల్‌)లిబరేషన్‌ పార్టీ ఆధ్వ ర్యంలో వామపక్ష సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి.

ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన

ఏలేశ్వరంలో వామపక్ష ప్రజా సంఘాల ఆందోళన

కళ్లకు గంతలు, అర్ధనగ్న ప్రదర్శన, ధర్నా


ఏలేశ్వరం, అక్టోబరు 1:  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏలేశ్వరంలో సీసీఐ(ఎంఎల్‌)లిబరేషన్‌ పార్టీ ఆధ్వ ర్యంలో వామపక్ష సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. పార్టీ జిల్లా కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు నాయకత్వంలో గురువారం జరిగిన ఈ ఆందోళనలో ఐప్వా మహిళ, కిసాన్‌మహాసభ, గ్రామీణ వ్యవసాయ కార్మిక, ఏఐసీసీటీయూ, లిబరేషన్‌ పార్టీలకు చెందిన 400 మంది మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతాంగ వ్యతిరేక వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని, ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, కార్మికుల హక్కుల పరిరక్షణ చట్టాలు అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలు కళ్లకు గంతలు కట్టుకోగా పురుషులు అర్ధనగ్నంగా పట్టణ వీధుల్లో నిరసన ప్రదర్శన, బాలాజీచౌక్‌ సెంటర్‌లో రాస్తారోకో అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి రైతుల భవిష్యత్‌ ప్రయోజనాలకు భంగం కలిగించేందుకు వ్యవసాయ బిల్లులు ఆమోదించారని గణేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మసకప ల్లి ధనబాబు, గుర్రం గోవిందు, కోన గంగాధర్‌, ఎన్‌.అర్జునుడు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-02T08:30:30+05:30 IST