వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన

ABN , First Publish Date - 2021-01-19T06:21:00+05:30 IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఐద్వా, అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో సోమవారం నిరసన ప్రదర్శన జరిగింది.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన
నెహ్రూచౌక్‌లో ర్యాలీ చేస్తున్న మహిళా, రైతు సంఘాలు

అనకాపల్లి టౌన్‌, జనవరి 18: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఐద్వా, అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో సోమవారం నిరసన ప్రదర్శన జరిగింది. ఈ చట్టాలను రద్దుచేయాలని సమితి కన్వీనర్‌ ఎ.బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సంస్కరణలను రద్దు చేసి దేశ లౌకిక, సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ఐఆర్‌ గంగాధర్‌, గంటా శ్రీరామ్‌, ఐద్వా ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్‌ సీఎండీ కార్యాలయం ఎదుట కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. కార్యక్రమంలో బాలకృష్ణ, కర్రి అప్పారావు, గంటా శ్రీరామ్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-19T06:21:00+05:30 IST