రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత

ABN , First Publish Date - 2022-10-03T04:07:05+05:30 IST

రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ పౌరు డి బాధ్యత అని సీపీఐ నాయకులు, ఇండియన్‌ జర్నలిస్టు యూని యన్‌ (ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు కె శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న సీపీఐ జాతీయ మహాసభలలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో సన్నా హక సమావేశానికి ముఖ్య వక్తగా హాజరయ్యారు.

రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌రెడ్డి

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 2: రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ పౌరు డి బాధ్యత అని సీపీఐ నాయకులు, ఇండియన్‌ జర్నలిస్టు యూని యన్‌ (ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు కె శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న సీపీఐ జాతీయ మహాసభలలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో సన్నా హక సమావేశానికి ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఆయన మాట్లాడు తూ ప్రజలందరి మధ్య శాంతి, ఐక్యత కలిగి ఉండాలంటే రాజ్యాంగ పరిరక్షణ ఎంతో అవసరమన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రాజ్యాం గాన్ని తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తోందని, ఆ కుట్రలను భగ్నం చేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ భావాలు, మత విభజన ద్వారా ప్రజల్లో రాజకీయ ప్రాబల్యాన్ని కొన సాగించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలు, మేధావులు, ప్రగతిశీల శక్తులు, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రతీ పౌరుడు తనకు నచ్చిన మతా న్ని స్వీకరించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు కలిగి ఉన్నాడని, లౌకిక విధానాల ద్వారానే దేశ సమగ్రత కొనసా గుతుందని వివరించారు. బీజేపీ ప్రభుత్వంలో మైనార్టీలు, దళితు లపైన దాడులు చేస్తూ విద్వేషా లను రెచ్చగొట్టడం విచారకరమ న్నారు. రోజుకు వెయ్యి కోట్ల ఆదాయం ఉన్న అధానీ, అం బానీలకు సహజ సంపదను దోచిపెట్టడం ద్వారా దేశాన్ని  ప్రైవేటీకరించేందుకు పూనుకుం టున్న చర్యలను వ్యతిరేకించా లన్నారు. నష్టాల్లో ఉన్న సం స్థలను మాత్రమే ప్రైవేటీకరిస్తున్నామనే ఆలోచన నుంచి లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్మడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.   సీపీఐ కార్యవర్గ సభ్యుడు శంకర్‌, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, మేకల దాసు, పట్టణ కార్యదర్శి కలేందర్‌ ఆలీఖాన్‌, మల్లయ్య, చంద్రశే ఖర్‌, పూర్ణిమ, వెంకటస్వామి, వీరభద్రయ్య, నర్సయ్య  పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-10-03T04:07:05+05:30 IST