బాలల హక్కుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత

ABN , First Publish Date - 2022-10-02T06:06:02+05:30 IST

బాలల హక్కుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బా ధ్యత అని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆధ్వర్యంలో ‘బాలల-హక్కులు, చట్టాల’పై గ్రామ, మండలస్థాయి బాలల పరిరక్షణ కమిటీల చైన్‌పర్సన్‌లకు నిర్వహించిన అవగాహన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు.

బాలల హక్కుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి

విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి 


నల్లగొండ టౌన్‌, అక్టోబరు1: బాలల హక్కుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బా ధ్యత అని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆధ్వర్యంలో ‘బాలల-హక్కులు, చట్టాల’పై గ్రామ, మండలస్థాయి బాలల పరిరక్షణ కమిటీల చైన్‌పర్సన్‌లకు నిర్వహించిన అవగాహన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, సంరక్షణలో తల్లిదండ్రులతోపాటు సమాజం, ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలన్నారు. పట్టణాల్లో పిల్లలను యాచకవృత్తిలోకి దించి, డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆడపిల్లల అక్రమ రవాణా, ఇటుక బట్టీల్లో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుందన్నారు. బాలల హక్కుల పరిరక్షణలో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు కీలకపాత్ర పోషించాలన్నారు. 


ప్రతీ గ్రామంలో వసతుల కల్పన

రాష్ట్ర ప్రభుత్వం ప్రతీగ్రామంలో మంచినీటి సౌకర్యం, వైకుంఠధామాల నిర్మాణం, పల్లెప్రకృతి వనాలఏర్పాటు, డంపింగ్‌యార్డులు, చెత్తసేకరణకు ట్రాక్టర్ల వసతులు వంటి సౌకర్యాలు కల్పిస్తోందని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా బడిఈడు పిల్లలందరిని బడిలో చేర్పించడం, ఏరాష్ట్రంలో లేనన్ని గురుకులాలను తెలంగాణలో ఏర్పాటు చేశామన్నారు. గురుకులాల్లో ప్రతీ విద్యార్థిపై రూ.1.25లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు అంజన్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని 33జిల్లాల్లో బాలల హక్కుల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, బృందాదర్‌రావు, ఆర్డీవో జగన్నాథరావు, జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఈవో భిక్షపతి, ఐసీడీఎస్‌ పీడీ సుభద్ర పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-02T06:06:02+05:30 IST