కాలుష్య ప్రభావం నుంచి రక్ష!

ABN , First Publish Date - 2020-11-17T17:40:37+05:30 IST

కరోనా వైరస్‌ ఉధృతి పెరగడానికి కాలుష్యం కూడా కారణమే! అయితే కాలుష్య ప్రభావం శరీరం మీద పడకుండా ఉండాలంటే అందుకు తోడ్పడే పదార్థాలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి.

కాలుష్య ప్రభావం నుంచి రక్ష!

ఆంధ్రజ్యోతి(17-11-2020)

కరోనా వైరస్‌ ఉధృతి పెరగడానికి కాలుష్యం కూడా కారణమే! అయితే కాలుష్య ప్రభావం శరీరం మీద పడకుండా ఉండాలంటే అందుకు తోడ్పడే పదార్థాలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి.


బెల్లం: శరీరంలో ప్రమాదకర టాక్సిన్లు, కలుషితాలను బయటకు పంపించే శక్తి బెల్లానికి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ భోజనం తర్వాత ఒక టీస్పూను బెల్లం తినడం అలవాటు చేసుకోవాలి. లేదా పరగడుపున బెల్లం కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగాలి.


ఉసిరి: ఉసిరిలో విటమిన్‌ సి ఎక్కువ. రోగనిరోధకశక్తి సక్రమ పనితీరుకు తోడ్పడే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు ఉసిరిలో ఉంటాయి. శ్వాసకోశ సమస్యలు, దగ్గు, జలుబులకు ఉసిరి మేలు చేస్తుంది. కాబట్టి ఆహారంలో ఉసిరిని చేర్చుకోవాలి.


నట్స్‌, సీడ్స్‌: విటమిన్‌ ఎ, బి, సి, ఇలతో పాటు యాంటీఆక్సిడెంట్లు వీటిలో ఎక్కువ. ప్రతి రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవడం ద్వారా శరీరంలోని టాక్సిన్లను బయటకు వెళ్లగొట్టవచ్చు. ఇందుకోసం అవిసె గింజలు, వేరుసెనగపప్పు, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు తీసుకుంటూ ఉండాలి.


పసుపు: ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. కాబట్టి వ్యాధుల నుంచి రక్షణ దక్కుతుంది. రాత్రి నిద్రకు ముందు పసుపు కలిపిన గోరువెచ్చని పాలు తాగితే, పూర్తి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. నెయ్మి, పసుపు, బెల్లం కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది.


టమాటా: వీటిలో లైకోపీన్‌, బీటాకెరోటిన్‌, విటమిన్‌ సి, ట్రేస్‌ మినరల్స్‌ ఉంటాయి. ఇవన్నీ కాలుష్యభరిత వాతావరణం నుంచి శరీరానికి రక్షణ కల్పించేవే!


బ్రొకొలి: ఈ సూపర్‌ ఫుడ్‌ జీర్ణశక్తిని పెంచి, టాక్సిన్లతో పోరాడుతుంది.

Updated Date - 2020-11-17T17:40:37+05:30 IST