న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడండి

ABN , First Publish Date - 2021-09-19T05:23:42+05:30 IST

న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడండి

న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడండి
కార్యక్రమానికి హాజరైన ఎంపీ, కలెక్టర్‌, న్యాయమూర్తులు

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూక్తి అరుప్‌కుమార్‌ గోస్వామి

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 18: న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడేందుకు  ప్రతిఒక్కరూ కృషిచేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుప్‌కుమార్‌ గోస్వామి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్మించిన భవనాలను ప్రారంభోత్సవం చేయడంతో పాటు బార్‌ అసోసియేషన్‌ భవన నిర్మాణానికి డిజిటల్‌ విధానంలో విజయవాడ నుంచి శంకుస్థాపన చేశారు. బార్‌ అసోసియేషన్‌ భవనానికి ఎంపీ రామ్మోహన్‌నాయుడు రూ.30 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గోస్వామి మాట్లాడుతూ న్యాయవ్యవస్థకు శ్రీకాకుళం జిల్లా ఎన్నో మంచి విషయాలను అందించిందని గుర్తుచేశారు. శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని కొనియాడారు.అదే స్ఫూర్తితో చక్కటి పనితీరును చూపించాలని చెప్పారు. న్యాయస్థానం భవనాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకాకుళం బార్‌ అసోసియేషన్‌ సేవలను అభినందించారు.  హైకోర్టు న్యాయమూర్తి, శ్రీకాకుళం జిల్లా పరిపాలన న్యాయమూర్తి రఘునందనరావు మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల రక్షణ అంశాలకు సంబంధించి కోర్టు సేవలు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకటేశ్వర్లు, ఫ్యామిలీ కోర్టు జడ్జి అన్నపూర్ణ, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి నాగమణి, అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి అనూరాధ, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి జయలక్ష్మి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీలక్ష్మి, మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.రాణి, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, న్యాయవాదులు పి.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-09-19T05:23:42+05:30 IST