పాఠశాలలను సొంత ఆస్తిలా పరిరక్షించుకోవాలి

ABN , First Publish Date - 2021-07-25T07:06:11+05:30 IST

ప్రభుత్వ పాఠశాలను తమ సొంత ఆస్తిలా భావించి వాటి అభివృద్ధికి తోడ్పాటును ప్రజలు అందించాలని ఎమ్యెల్సీ ప్రోటెం చైర్మన్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

పాఠశాలలను సొంత ఆస్తిలా పరిరక్షించుకోవాలి
మాట్లాడుతున్నా ఎమ్మెల్సీ ప్రొటెం చైర్మన్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం

ఎమ్మెల్సీ ప్రొటెం చైర్మన్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం

 గుడ్లూరు, జూలై 24 : ప్రభుత్వ పాఠశాలను తమ సొంత ఆస్తిలా భావించి వాటి అభివృద్ధికి తోడ్పాటును ప్రజలు అందించాలని ఎమ్యెల్సీ ప్రోటెం చైర్మన్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ‘నాడు - నేడు’ పనుల నిర్వహణ తీరుపై అయన జిల్లా విద్యాశాఖ అధికారులతో గుడ్లూరు ఆదిఆంద్రపాలెం పాఠశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా ఉపాఽధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు మంచి బోదన ఇవ్వడానికి అవసరమైన అన్ని వసతులు నాడు - నేడు ద్వారా సమకూరాయన్నారు. విద్యార్థుల అవసరాలరీత్యా ప్రభుత్వం పాఠశాలలకు తగు ఫర్నీచర్‌ కూడా అందజేసిందన్నారు. నేటి కరోనా నేపథ్యంలో పిల్లలకు ప్రత్యామ్నాయ బోధన అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు స్థానికంగా కావాల్సిన వసతుల గురించి అడిగి విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. 1 నుంచి 5 తరగతుల వరకు తమ కాలనీలోనే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్చాలన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి వీ.ఎస్‌ సుబ్బారావు మాట్లాడుతూ  పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే కాక పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవచూపడం హర్షణీయమన్నారు. అనంతరం విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రాంగణంలో వివిధ రకాల మెక్కలను నాటారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సురేఖ, ఎంపీడీవో నాగేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్‌ కిషోర్‌రెడ్డి, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిలారి వెంటేశ్వర్లు, ఉపాధ్యాయులు గొర్రెపాటి మధు, పారా శ్రీనివాసులు,  దివి.చిన్నమ్మాయి, పాఠశాల హెచ్‌ఎంలు కాట్రగడ్డ శ్రీహరి, తిరపతిస్వామి, తిరపతిరెడ్డి, గుడ్లూరు హైస్కూల్‌ హెచ్‌ఎం రామ్మోహ న్‌, పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T07:06:11+05:30 IST