కిడ్నీ వ్యాధి - అపోహలు, వాస్తవాలు

ABN , First Publish Date - 2022-07-19T18:33:27+05:30 IST

మూత్రపిండాలు, వాటి రుగ్మతలు, చికిత్సల గురించి ఎన్నో అపోహలు వాడుకలో ఉన్నాయి. చివరి దశ వరకూ

కిడ్నీ వ్యాధి - అపోహలు, వాస్తవాలు

మూత్రపిండాలు, వాటి రుగ్మతలు, చికిత్సల గురించి ఎన్నో అపోహలు వాడుకలో ఉన్నాయి. చివరి దశ వరకూ ఎలాంటి వ్యాధి లక్షణాలనూ బయల్పరచని మూత్రపిండాల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే, క్రమం తప్పకుండా రక్త, మూత్ర పరీక్షలు చేయించుకుంటూ అనవసరపు అపోహలను వదిలించుకోవాలి.


అపోహ: సీరం క్రియాటిన్‌ లెవెల్‌ సాధారణం కన్నా ఎక్కువే ఉంది. అయినా ఆరోగ్యంగానే ఉన్నాను. కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరమేమీ లేదు. 

వాస్తవం: సీరం క్రియాటిన్‌ ఏ కొంచెం పెరిగినా, ఉదాహరణకు 1.5 ఎం.జి/డి.ఎల్‌ కు చేరినా అప్పటికే కిడ్నీ పనితీరులో 50 శాతం నష్టం జరిగిందని అర్థం. వ్యాధి లక్షణాలేమీ కనిపించడం లేదని నిశ్చింతగా ఉండిపోకూడదు. తరచూ పరీక్షలు చేయించుకుంటూ, ఆహార నియంత్రణతో పాటు, రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి., డీ-హైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి.

అపోహ: కిడ్నీ రోగులు మాంసకృత్తులు పూర్తిగా మానేయాలి.  

వాస్తవం: తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్థులు ప్రొటీన్‌ తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవ చ్చు.

అపోహ: టమోటాలు ఆహారంగా తీసుకోకూడదు. 

వాస్తవం: కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య ఉన్నవాళ్లు మాత్రమే టమోటాలు తినకూడదు. పొటాషియం మరీ ఎక్కువగా లేకపోతే, టమోటాలను ఆహారంగా తీసుకోవచ్చు. 

అపోహ: రక్తపోటు సమస్య, మందులతోనే పూర్తిగా అదుపులోకి వస్తుంది.

వాస్తవం: మందులతో పాటు ఆహార నియమాలు కూడా పాటించాలి.

అపోహ: ఒకసారి డయాలిసిస్‌ ప్రారంభమైతే, ఇక జీవితాంతం కొనసాగించాలి.

వాస్తవం: ఏ కారణంగానైనా కిడ్నీకి బలంగా గాయమై విఫలమైనప్పుడు, కిడ్నీ తిరిగి కోలుకునే దాకా తాత్కాలిక డయాలసిస్‌ అవసరమవుతుంది. ఒకవేళ దీర్ఘకాల వ్యాధితో  కిడ్నీ దెబ్బతిని ఉంటే, వైద్య చికిత్సలతో అది కోలుకోకపోతే, జీవితాంతం డయాలసిస్‌ అవసరమవుతుంది.

Updated Date - 2022-07-19T18:33:27+05:30 IST