ప్రభుత్వ భూములను పరిరక్షించండి

ABN , First Publish Date - 2021-06-15T05:18:49+05:30 IST

ప్రభుత్వ భూములను పరిరక్షించండి

ప్రభుత్వ భూములను పరిరక్షించండి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న ఆర్‌.కృష్ణయ్య, నాయకులు

  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

మేడ్చల్‌ అర్బన్‌: ప్రభుత్వ భూములను పారిశ్రామికవేత్తలు కాజేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నాగారం భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి, అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డికి వినతిపత్రమిచ్చారు. అనంత రం కృష్ణయ్య మాట్లాడుతూ నాగారం-కీసరకు రహదారికి ఆనుకుని ఉన్న సర్వే నెంబర్లు 47, 55, 56, 60లలో 1960లో 10.01ఎకరాల లేఅవుట్‌లో 162 ప్లాట్లు చేసి, 12,000గజాలను రోడ్లకు, 1,670గజాలను పార్కు కోసం వదిలేశారని తెలిపారు. ప్రజావసరాలకు వదిలిన భూమిని ఐకాం పరిశ్రమ ప్రతినిధి పాతూరి రామారావు ఆక్రమించుకుంటున్నారని కృష్ణయ్య ఆరోపించారు. సర్వే నెంబరు 59లోని జాలుబాయి కుంట ఐదెకరాల ఎఫ్‌టీఎల్‌ స్థలాన్నీ కబ్జా చేశారని తెలిపారు. ఐకాం కంపెనీ ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు, గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణానికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి భూపే్‌షసాగర్‌, ప్రసాద్‌గౌడ్‌, రాజేందర్‌, మనోజ్‌చారి, నిఖిల్‌, సంతోష్‌, శంకరచారి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T05:18:49+05:30 IST