పాడి సంపదను కాపాడండి

ABN , First Publish Date - 2021-04-13T06:12:28+05:30 IST

రాచపల్లి పశువైద్య కేంద్రంలో వైద్యాధికారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నామని పలు గ్రామాల రైతులు వాపోయారు.

పాడి సంపదను కాపాడండి
రాచపల్లి పశువైద్య కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్న రైతులు

 

  రాచపల్లి పశు వైద్య కేంద్రంలో వైద్యుడ్ని నియమించాలని రైతుల డిమాండ్‌ 

 ఆస్పత్రి ఎదుట ఆందోళన


మాకవరపాలెం, ఏప్రిల్‌ 12 : రాచపల్లి పశువైద్య కేంద్రంలో వైద్యాధికారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నామని పలు గ్రామాల రైతులు వాపోయారు. ఇందులో భాగంగా సోమవారం పశువైద్య కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాచపల్లి, జి.కోడూరు, ఎరకన్నపాలెం, రామన్నపాలెం, జి.వెంకటాపురం గ్రామాల్లో పాడి సం పదపైనే చాలా మంది ఆధారప డుతు న్నారన్నారు. ఈ గ్రామాల్లో ఉన్న భూములు అన్‌రాక్‌ కంపెనీ తీసుకో వడంతో పాడిని ఆయా రైతులు నమ్ముకున్నారన్నారు. గతంలో ఇక్కడ పనిచేసే వైద్యుడు పి.నరేశ్‌ పాడేరుకు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో పశువులకు వైద్యం చేసేవారు కరువయ్యారన్నారు. ఫలితంగా వివిధ రకాల వ్యాధులతో సరైన వైద్యం అందక పశువులు మృత్యువాత పడుతున్నట్టు చెప్పారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇక్కడ పశువైద్యుడ్ని నియమించాలని రాచపల్లి సర్పంచ్‌ సతీరాముడుతో పాటు రైతులంతా కోరారు.

Updated Date - 2021-04-13T06:12:28+05:30 IST