వ్యభిచారం ట్రాఫికింగ్‌ నేరం కాదు!

ABN , First Publish Date - 2020-09-27T08:26:07+05:30 IST

వ్యభిచారం ట్రాఫికింగ్‌ చట్టం కింద క్రిమినల్‌ నేరం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. వ్యభిచారం ఆరోపణలపై అరెస్టు చేసి, మహిళా పరివర్తన కేంద్రంలో ఉంచిన ముగ్గురు సెక్స్‌ వర్కర్లను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది...

వ్యభిచారం ట్రాఫికింగ్‌ నేరం కాదు!

  • ముగ్గురు మహిళల విడుదలకు బాంబే హైకోర్టు ఆదేశం

ముంబయి, సెప్టెంబరు 26: వ్యభిచారం ట్రాఫికింగ్‌ చట్టం కింద క్రిమినల్‌ నేరం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. వ్యభిచారం ఆరోపణలపై అరెస్టు చేసి, మహిళా పరివర్తన కేంద్రంలో ఉంచిన ముగ్గురు సెక్స్‌ వర్కర్లను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ట్రాఫికింగ్‌ చట్టంలో ఎక్కడా వ్యభిచారాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణించలేదని గుర్తు చేసింది. స్థానిక మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ అరెస్టయిన ముగ్గురు సెక్స్‌ వర్కర్లను ప్రభుత్వ మహిళా పరివర్తన కేంద్రంలో ఉంచాలని ఆదేశించారు.

Updated Date - 2020-09-27T08:26:07+05:30 IST