ప్రోస్టేట్‌ గ్రంథి సమస్యలు

ABN , First Publish Date - 2021-08-17T17:28:12+05:30 IST

వాల్‌నట్‌ ఆకారంలో ఉండే ప్రోస్టేట్‌ గ్రంథి మూత్రాశయానికి దిగువన, యురెత్రాను చుట్టుకుని, పురీషనాళానికి ముందు భాగంలో ఉంటుంది. ఈ గ్రంథి స్రావాలు వీర్యంతో కలిసి, వీర్యానికి పోషణనిచ్చి, సరఫరాకు తోడ్పడతాయి.

ప్రోస్టేట్‌ గ్రంథి సమస్యలు

ఆంధ్రజ్యోతి(17-08-2021)

వాల్‌నట్‌ ఆకారంలో ఉండే ప్రోస్టేట్‌ గ్రంథి మూత్రాశయానికి దిగువన, యురెత్రాను చుట్టుకుని, పురీషనాళానికి ముందు భాగంలో ఉంటుంది. ఈ గ్రంథి స్రావాలు వీర్యంతో కలిసి, వీర్యానికి పోషణనిచ్చి, సరఫరాకు తోడ్పడతాయి. 


ప్రోస్టేట్‌ సమస్యలు

ప్రోస్టటైటిస్‌ (ప్రోస్టేట్‌ గ్రంథి వాపు)

బిహెచ్‌ఇ/బిపిఇ (కేన్సర్‌తో సంబంధం లేని ప్రోస్టేట్‌ వాపు)

ప్రోస్టేట్‌ కేన్సర్‌


ఏ వయసు వాళ్లు?

40 ఏళ్ల కంటే తక్కువ వయస్కుల్లో బిపిహెచ్‌ తక్కువ. ఈ సమస్య వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది. అయితే 50 ఏళ్ల కంటే తక్కువ వయస్కుల్లో ప్రోస్టైటిస్‌ సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. మూత్రనాళ సమస్యలతో ప్రోస్టటైటిస్‌ సమస్య పెరుగుతుంది.


బినైన్‌ ప్రోస్టేట్‌ హైపర్‌ప్లేసియా (బిపిహెచ్‌)

దీన్నే ప్రోస్టేట్‌ గ్లాండ్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ అంటారు. వయసు పెరిగే పురుషుల్లో ఈ సమస్య సహజం. ఇలా పరిమాణం పెరిగిన ప్రోస్టేట్‌ గ్రంథి మూత్ర సంబంధ అసౌకర్యాలకు లోను చేస్తుంది. మూత్రవిసర్జనలో అవరోధాలు ఏర్పడతాయి. మూత్రాశయం, మూత్రనాళం, లేదా మూత్రపిండాల సమస్యలకు కూడా దారి తీస్తుంది.


లక్షణాలు

ప్రోస్టేట్‌ గ్రంథి వాపు లక్షణాల తీవ్రత ఒక్కొకరిలో ఒక్కోలా ఉంటుంది. అయితే కాలం గడిచేకొద్దీ లక్షణాల తీవ్రత పెరుగుతుంది. 


సాధారణ లక్షణాలు...

తరచుగా లేదా అత్యవసరంగా మూత్రవిసర్జన చేయవలసి రావడం

రాత్రుళ్లు తరచుగా మూత్రవిసర్జన అవసరం పెరగడం

మూత్రం చుక్కలుగా కారడం

మూత్రవిసర్జన ప్రారంభంలో ఇబ్బంది తలెత్తడం

ధార సన్నగా ఉండడం

ఆగి ఆగి మూత్రవిసర్జన జరుగుతూ ఉండడం

మూత్రాశయం ఖాళీ అవకపోవడం


ప్రోస్టేట్‌ పరిమాణం మీద లక్షణాలు ఆధారపడి ఉండవు. కొద్దిగా ప్రోస్టేట్‌ వాపు ఉన్న కొందరు పురుషుల్లో కూడా లక్షణాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా వాపు ఉన్న ప్రోస్టేట్‌ కలిగిన పురుషుల్లో తక్కువ లక్షణాలు కూడా ఉండే వీలుంది. అలాగే కొందర్లో లక్షణాలు వాటంతట అవే నెమ్మదించి, కాలక్రమేణా తగ్గిపోయే అవకాశాలూ ఉంటాయి.


బిపిహెచ్‌ తీవ్రమైతే...

మూత్రం ఆగిపోవడం (మూత్రవిసర్జన చేయలేకపోవడం)

హెమటూరియా(మూత్రంలో రక్తం)

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌

మూత్రాశయంలో రాళ్లు

మూత్రాశయం డ్యామేజీ

మూత్రపిండాల డ్యామేజీ


పరీక్షలు  

అలా్ట్రసౌండ్‌, పూర్తి మూత్ర పరీక్ష, మూత్రం కల్చర్‌, సెన్సిటివిటీ, యూరోఫ్లోమెట్రీ, సీరం ్కఖిఅ, ట్రస్‌, యూరోడైనమిక్‌ స్టడీ.


చికిత్స

అల్ఫాబ్లాకర్స్‌, 5 అల్ఫా రెడక్టేజ్‌ ఇన్హిబిటర్స్‌ అనే సింగిల్‌ లేదా కాంబినేషన్‌ డ్రగ్స్‌తో చికిత్స చేయవచ్చు. అల్ఫాబ్లాకర్లు మూత్రాశయ కంఠాన్ని వదులు చేసి యూరిన్‌ ఫ్లోను పెంచుతాయి. 5 అల్ఫా రెడక్టేజ్‌ ఇన్హిబిటర్లు ప్రోస్టేట్‌ వ్యాకోచానికి కారణమైన హార్మోన్ల మార్పులను సరిదిద్దడం ద్వారా ప్రోస్టేట్‌ను కుంచించుకుపోయేలా చేస్తాయి. మధ్యస్థం నుంచి తీవ్ర లక్షణాలు కలిగినవారికి మందులతో ఉపశమనం లభించని వారికి, మూత్రాశయంలో రాళ్లు ఏర్పడిన వాళ్లకు, హెమటూరియా తరచుగా బాధించేవాళ్లకు సర్జరీ అవసరం పడుతుంది.


డాక్టర్‌ వినయ్‌ కుమార్‌ అంకం

కఖి, క.ఛిజి (యూరాలజీ)

కన్సల్టెంట్‌ యూరాలజిస్ట్‌ - ఆండ్రోలజిస్ట్‌,

రెనోవా హాస్పిటల్స్‌, లంగర్‌హౌజ్‌

కాంటాక్ట్‌ నం: 9912341701, 9912341702


Updated Date - 2021-08-17T17:28:12+05:30 IST