Traffic fine: ప్రవాసుల విషయంలో కువైత్ కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-08-05T13:21:18+05:30 IST

ట్రాఫిక్ జరిమానా చెల్లించని ప్రవాసుల విషయంలో గల్ఫ్ దేశం కువైత్ కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Traffic fine: ప్రవాసుల విషయంలో కువైత్ కీలక నిర్ణయం!

కువైత్ సిటీ: ట్రాఫిక్ జరిమానా చెల్లించని ప్రవాసుల విషయంలో గల్ఫ్ దేశం కువైత్ కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ప్రవాసులు వాటికి సంబంధించిన జరిమానాలు చెల్లించకుండా దేశం విడిచిపెట్టి వెళ్లనీయకుండా బ్యాన్ విధించాలనే ప్రతిపాదన చేసే యోచనలో కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి షేక్ థామెర్ అల్ అలీకి ట్రాఫిక్ విభాగం ప్రతిపాదన పెట్టిందని అక్కడి ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ప్రవాసులతో పాటు కువైటీలకు వాటి తాలుకు జరిమానాలు చెల్లించే వరకు అన్ని రకాల సేవలను నిలిపివేయాలని ట్రాఫిక్ విభాగం ప్రతిపాదించింది.


ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలు మిలియన్స్ ఆఫ్ దినార్లు ఉన్నట్లు సమాచారం. చాలా కాలంగా చాలా మంది వీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ అసహనం వ్యక్తం చేసింది. మరికొందరు ప్రవాసులు జరిమానాలు ఎగ్గొట్టి శాశ్వతంగా స్వదేశాలకు వెళ్లిపోయారని పేర్కొంది. ఉల్లంఘనదారులకు సందేశాలు పంపిస్తూ వెంటనే జరిమానాలు కట్టాలని ట్రాఫిక్ విభాగం కోరుతోంది. లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.        

Updated Date - 2021-08-05T13:21:18+05:30 IST