ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపు సరికాదు

ABN , First Publish Date - 2021-06-19T05:49:22+05:30 IST

ఆధారంగా పన్ను పెంపు సరికాదని, ఆస్తి, చెత్త పన్నుల పెంపును తక్షణమే విరమించుకోవాలని టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపు సరికాదు
మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌

గాజువాక, జూన్‌ 18: ఆస్తి విలువ  ఆధారంగా పన్ను పెంపు సరికాదని, ఆస్తి, చెత్త పన్నుల పెంపును తక్షణమే విరమించుకోవాలని టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఆస్తి పన్ను పెంపునకు నిరసనగా గాజువాక పార్టీ కార్యాలయంలో శుక్రవారం మోకాళ్లపై కూర్చుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రభుత్వం మానవత్వాన్ని మరిచి పన్నులు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. పన్ను పెంపు ఉత్తర్వులను ఉపసంహరించుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్డాడ సోమినాయుడు, చెరుకూరి నాగేశ్వరరావు, వాసు, నమ్మి సింహాద్రి, అనంత్‌, నమ్మి అప్పారావు, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-19T05:49:22+05:30 IST