పదివేల మందికి ఆస్తిపన్ను నోటీసులు

ABN , First Publish Date - 2022-01-22T04:51:38+05:30 IST

పట్టణంలో 11,301 అసెస్‌మెంట్లు ఉన్నాయని, వారిలో పదివేల మందికి ఆస్తిపన్ను చెల్లింపునకు నోటీసులు పంపినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు.

పదివేల మందికి ఆస్తిపన్ను నోటీసులు

బొబ్బిలి రూరల్‌, జనవరి 21: పట్టణంలో 11,301 అసెస్‌మెంట్లు ఉన్నాయని,  వారిలో పదివేల మందికి ఆస్తిపన్ను చెల్లింపునకు నోటీసులు పంపినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు.  శుక్రవారం తన కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులు ,  సచివాలయాల కార్యదర్శులకు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  నూతన ఆదేశాల మేరకు సబ్‌రిజిస్ర్టార్‌ నిర్ణయించిన ధర ప్రాతిపదికగా ఆస్తులపై  15 శాతం పెంపుదలతో  పన్ను నిర్ణయించినట్లు తెలిపారు.   374 చదరపు అడుగుల విస్తీర్ణం లోపు ఉన్న ఇళ్లకు సంవత్సరానికి రూ. 54 ఆస్తిపన్నును నిర్ణయించినట్లు చెప్పారు.  ఇంత వరకు పట్టణంలో 11 వేల అసెస్‌మెంట్ల నుంచి ఏడాదికి రూ.మూడు కోట్ల  ఆస్తిపన్ను డిమాండ్‌ ఉందని, బకాయిలు మరో రూ.కోటి రూపాయలు రావాల్సి ఉందని చెప్పారు.  పెంచిన ఆస్తిపన్నుతో కలిపి  ప్రజల నుంచి ఎంత రావాల్సి ఉంటుందో అంచనా వేస్తున్నామని  తెలిపారు. 

 

Updated Date - 2022-01-22T04:51:38+05:30 IST