Abn logo
Jun 17 2021 @ 00:31AM

ఆస్తి పన్ను పెంపు అన్యాయం

ధర్నాలో మాట్లాడుతున్న బీజేపీ కన్వీనర్‌ కరణంరెడ్డి నరసింగరావు

బీజేపీ ఆధ్వర్యంలో జోనల్‌ కార్యాలయం ఎదుట ధర్నా

గాజువాక, జూన్‌ 16: ఆస్తి పన్ను, నీటి చార్జీల పెంపు  జీవోలను తక్షణమే రద్దు చేయాలని బీజేపీ గాజవాక కన్వీనర్‌ కరణంరెడ్డి నరసింగరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీనులు డిమాండ్‌ చేశారు. ఆస్తి పన్ను పెంపునకు నిరసనగా బుధవారం పార్టీ ఆధ్వర్యంలో జోనల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్తి పన్ను పెంపు అన్యాయమని,  జీవోలను ఉపసంహరించకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దీనంకొండ కృష్ణంరాజు, గొళి శంకరరావు, రోహిణి, నాగేశ్వరరావు, వర్రి లలిత, బొండా యల్లాజీ, వెన్నా శ్రీరామ్మూర్తి, చందు పాల్గొన్నారు.