Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రోనింగ్‌తో శ్వాస తేలికగా...

ఆంధ్రజ్యోతి(27-04-2021)

ఎక్కువ శాతం కొవిడ్‌ బాధితులు హోం ఐసొలేషన్‌లో గడుపుతూ ఉన్న పరిస్థితి. ఈ సమయంలో శ్వాసలో ఇబ్బందులు తలెత్తితే, వెంటనే వైద్యులను సంప్రతించక తప్పదు. అయితే శ్వాసపరమైన స్వల్ప ఇబ్బందులను ప్రోనింగ్‌తో నియంత్రించవచ్చని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సూచిస్తోంది. ఆ వివరాలు....


కొవిడ్‌ బాధితుల శ్వాసను మెరుగుపరచడం కోసం బోర్లా పడుకోబెట్టడమే ప్రోనింగ్‌!

ఆక్సిజన్‌ తేలికగా ఊపిరితిత్తుల్లోకి చేరుకోవడానికి, శ్వాస మెరుగవడానికి తోడ్పడుతుందని వైద్యపరమైన అనుమతి పొందిన బాడీ పొజిషన్‌ ఇది! 

ఆక్సీమీటర్‌లో ఆక్సిజన్‌ స్థాయి 94 అంతకంటే తక్కువకు పడిపోయినప్పుడు, బాధితులను ఆస్పత్రికి తరలించేలోపు, ప్రోనింగ్‌ పొజిషన్‌లో పడుకోబెట్టడం వల్ల ముంచుకొచ్చే ప్రమాదం తప్పుతుంది.

భోజనం చేసిన గంట లోపు ప్రోనింగ్‌ పొజిషన్‌లో పడుకోకూడదు.

ఎంత ఎక్కువ సమయం పాటు ఆ పొజిషన్‌లో ఉండగలిగితే, అంత సమయం పాటే ఉండాలి.

శ్వాస పీల్చుకోవడంలో స్వల్ప ఇబ్బందులు కలిగినవాళ్లు, రోజు మొత్తంలో విడతలవారీగా 16 గంటల పాటు ప్రోనింగ్‌ పొజిషన్‌లో గడపడం వల్ల శ్వాస ఇబ్బందులు తొలగుతాయి.

ప్రోనింగ్‌ పొజిషన్‌కు 5 తలగడలు అవసరం అవుతాయి.

మెడ అడుగున ఒకటి, ఛాతీ నుంచి ఎగువ తొడల వరకూ నిలువునా ఒకటి లేదా రెండు తలగడలు, మోకాలు, యాంకిల్‌కు మధ్య ప్రదేశంలో ఒకటి లేదా రెండు తలగడలు ఉంచుకోవాలి.


Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement