139 మంది టీచర్లకు పదోన్నతులు

ABN , First Publish Date - 2020-10-17T11:25:13+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా తొలుత చేపడుతున్న పదోన్నతులపై స్పష్టత వచ్చింది.

139 మంది టీచర్లకు పదోన్నతులు

ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 16 : ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా తొలుత చేపడుతున్న పదోన్నతులపై స్పష్టత వచ్చింది. ఈ నెల 19న చేప ట్టనున్న పదోన్నతి కౌన్సెలింగ్‌లో జిల్లా పరిషత్‌ యాజమాన్యం నుంచి 103 మంది ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లు గాను, 32 మంది స్కూల్‌ అసిస్టెం ట్లకు గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులుగాను పదోన్నతి లభించనుంది. వీరితోపా టు గవర్నమెంటు యాజమాన్యం నుంచి మరో నలుగురు స్కూల్‌ అసిస్టెం ట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతి ఇవ్వనున్నారు. తొలుత సంబంధిత ఉపాధ్యా యుల నుంచి పదోన్నతికి అంగీకారాన్ని తీసుకుని బదిలీస్థానాలను మాత్రం సాధారణ ట్రాన్స్‌ఫర్‌ కౌన్సెలింగ్‌ చివరి రోజున ఇస్తారు.


పదోన్నతి లభించే ఉపాధ్యాయుల్లో సబ్జెక్టుల వారీగా స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం ఐదు, ఫిజికల్‌ సైన్స్‌ ఐదు, బయోలాజికల్‌ సైన్సు 21, ఇంగ్లిషు 13, సోషల్‌ స్టడీస్‌ 34, ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయులు 25 పోస్టులు ఉన్నాయి. మొత్తం మీద జడ్పీ యాజమాన్యం నుంచి 135, గవర్నమెంట్‌ యాజమాన్యం నుంచి 4 కలిపి మొత్తం 139 పోస్టులకు ఈ నెల 19 లేదా 20 తేదీల్లో అడహక్‌ ప్ర మోషన్లు ఇవ్వనున్నారు.


వెబ్‌సైట్‌లో సీనియార్టీ జాబితాలు

ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ యాజమాన్య పాఠశాలల్లో ఉపాధ్యాయుల పదో న్నతుల సీనియార్టీ జాబితాలను జిల్లా విద్యా శాఖ వెబ్‌సైట్లో పొందుపర్చి నట్లు డీఈవో రేణుక తెలిపారు. ఈ జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే శనివారంలోగా తగిన ఆధారాలతో తమకు అందజేయాలని కోరారు. పదో న్నతికి అర్హత కలిగిన అభ్యర్థులు శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎస్‌ జీటీ క్యాడర్‌ నుంచి స్కూలు అసిస్టెంట్‌ క్యాడర్‌కు పదోన్నతికి అర్హత కలిగిన సీనియార్టీ జాబితాలోని అభ్యర్థులు తమ ఎస్‌ఆర్‌, ధ్రువీకరణ పత్రాలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. 


టీచర్లకు తీవ్ర అన్యాయం 

టీచర్ల సాధారణ బదిలీలకు ముందే నెలవారీ పదోన్నతి కౌన్సెలింగ్‌ను నిర్వహించడం ఉపాధ్యాయుల హక్కులను హరించడమేనని పీఆర్‌టీయూ రాష్ట్ర సహ అధ్యక్షుడు పి.ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వర రావు ఆరోపించారు. ముందుగానే ఈ కౌన్సెలింగ్‌ వల్ల సంబంధిత ఉపాధ్యా యునికి బదిలీ స్థానం తెలిసే అవకాశాలు లేవని అన్నారు. బదిలీల షెడ్యూ ల్‌ చరిత్రలో ఎప్పుడూ ఇటువంటి దారుణ పరిస్థితులు చూడలేదన్నారు.

Updated Date - 2020-10-17T11:25:13+05:30 IST