Abn logo
Jul 25 2021 @ 23:49PM

పదోన్నతులు వెంటనే చేపట్టాలి

మాట్లాడుతున్న టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): ఉపాధ్యాయ పదోన్నతులను వెంటనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌ రవి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఫెడరేషన్‌ జిల్లా కమిటీ సమావేశాన్ని కర్మన్‌ఘాట్‌లోని నాగార్జున ఉన్న త పాఠశాలలో నిర్వహించారు. ముఖ్య అతిథి రవి మాట్లాడుతూ.. ఆరేళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతు ల్లేక ఉన్న క్యాడర్‌లోనే రిటైర్‌ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఈవో, ఎంఈవోల ఖాళీలతో విద్యావ్యవస్థలో పర్యవేక్షణ కొరవడిందన్నారు. ఉపాధ్యాయ ఖాళీల వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందని, ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పదోన్నతులు చేపట్టి విద్యావ్యవస్థను కాపాడలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి గాలయ్య, జిల్లా అధ్యక్షులు రాములయ్య, కార్యదర్శి వెంకటప్ప, ఉపాధ్యక్షుడు గోపాల్‌నాయక్‌, కోషాధికారి విజయభాస్కర్‌రెడ్డి, సునంద, నాగేంద్రం, వెంకటయ్య, కిషన్‌చౌహాన్‌, శివారెడ్డి, రఘుపాల్‌, భగవంత్‌రాజు, భీంరెడ్డి, న్సింహులుగౌడ్‌, శ్రీశైలం, రామకృష్ణ పాల్గొన్నారు.