హైదరాబాద్: తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురికి అదనపు డీజీపీలు, ఐదుగురికి ఐజీలుగా పదోన్నతి కల్పించింది. 1997 బ్యాచ్ కు చెందిన నలుగురు ఐపీఎస్‌లకు అడిషనల్ డీజీపీగా పదోన్నతి ఇచ్చింది. విజయ్ కుమార్, నాగిరెడ్డి, డీ.ఎస్. చోహన్, సంజయ్ కుమార్ జైన్లకు అడిషనల్ డీజీపీగా పదోన్నతి ఇచ్చింది.
అలాగే 2005 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐపీఎస్‌లకు ఐజీలుగా ప్రమోషన్స్ కల్పించింది. ఐపీఎస్‌లు తరుణ్ జోషి, వి శివకుమార్, వీబీ కమలాసన్ రెడ్డి, ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్‌కు పదోన్నతులను ఇచ్చింది.
2008 బ్యాచ్‌కు చెందిన తఫ్సర్ ఇక్బాల్‌కు డీఐజీగా ప్రమోషన్, 2009 బ్యాచ్‌కు చెందిన రేమ రాజేశ్వరి, అంబారి కిషోర్ ఝాలకు సెలెక్షన్స్ గ్రేడ్ ఆఫీసర్స్ కింద ప్రమోషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి