సాంకేతిక విద్యాశాఖలో పదోన్నతుల వివాదం

ABN , First Publish Date - 2020-09-25T09:15:34+05:30 IST

సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పదోన్నతుల వ్యవహారం వివాదంగా మారింది. గత నెల 31న డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశమై 11 మందికి పదోన్నతులు కల్పించడానికి...

సాంకేతిక విద్యాశాఖలో పదోన్నతుల వివాదం

హైదరాబాద్‌, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పదోన్నతుల వ్యవహారం వివాదంగా మారింది. గత నెల 31న డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశమై 11 మందికి పదోన్నతులు కల్పించడానికి ఆమోదం తెలిపింది. ఇందులో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను పాటించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. 

Updated Date - 2020-09-25T09:15:34+05:30 IST