ఇన్ఫోసిస్ లొ త్వరలో పదోన్నతులు... వేతన పెంపు కూడా...

ABN , First Publish Date - 2020-09-21T23:59:22+05:30 IST

కరోనా నేపధ్యంలో అనిశ్చితులున్నప్పటికీ... ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల వేతనాలను పెంచడంతో పాటు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించిందని సమాచారం. కరోనా కారణంగా... వివిధ రంగాల్లో చాలా కంపెనీల్లో ఉద్యోగాల కోత, వేతనాల కోత వంటి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో వంటి కంపెనీలపై కూడా ఈ ప్రభావం పడింది.

ఇన్ఫోసిస్ లొ త్వరలో  పదోన్నతులు... వేతన పెంపు కూడా...

బెంగళూరు : కరోనా నేపధ్యంలో అనిశ్చితులున్నప్పటికీ... ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల వేతనాలను పెంచడంతో పాటు పదోన్నతులనివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.


కరోనా కారణంగా... వివిధ రంగాల్లో చాలా కంపెనీల్లో ఉద్యోగాల కోత, వేతనాల కోత వంటి చర్యలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో వంటి కంపెనీలపై కూడా ఈ ప్రభావం పడింది.


కాగా... ఇన్ఫోసిస్... తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకున్నట్లు వినవస్తోంది. ఈ క్రమంలో... ఉద్యోగులకు వేతనాలు పెరుదల, పదోన్నతులు వంటి అంశాలు తెరమీదకు వచ్చాయి. సంస్థ సీఈవో సలీల్ పరేఖ్ ఓ ఇంటర్వ్యూలో  ఈ వివరాలను సూచనప్రాయంగా వెల్లడించారు.


అంతేకాకుండా... భారత్ సహా వివిధ ప్రాంతాల్లో భారీగా నియామకాలు చేపట్టేందుకు ఇన్ఫోసిస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 


Updated Date - 2020-09-21T23:59:22+05:30 IST