నేడు టీచర్లకు పదోన్నతి కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-10-20T06:53:03+05:30 IST

పదోన్నతికి అర్హులైన టీచర్ల ధ్రువపత్రాల పరిశీలన సోమవారం ఏలూరు డీఇవో కార్యాలయంలో జరిగింది. మొత్తం 178

నేడు టీచర్లకు పదోన్నతి కౌన్సెలింగ్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 19 : పదోన్నతికి అర్హులైన టీచర్ల ధ్రువపత్రాల పరిశీలన సోమవారం ఏలూరు డీఇవో కార్యాలయంలో జరిగింది. మొత్తం 178 హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీల భర్తీకి మంగళవారం పదోన్నతి కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. వీటిలో 37 హెచ్‌ఎం ఖాళీలు, స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం 8, ఫిజికల్‌ సైన్స్‌ 5, బయోలాజికల్‌ సైన్స్‌ 22, ఇంగ్లీషు 13, సోషల్‌ స్టడీస్‌ 36, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం 25, తెలుగు 23, హిందీ 6, ఫిజికల్‌ డైరెక్టర్‌ 3 ఖాళీలను భర్తీ చేయనున్నారు.


మంగళవారం ఉదయం అన్ని సబ్జెక్టులకు, మధ్యాహ్నం సోషల్‌ స్టడీస్‌, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం ఖాళీల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఆ మేరకు పదోన్నతికి ఇష్టపడే టీచర్ల నుంచి అంగీకార పత్రాలను తీసుకుని, సాధారణ బదిలీ కౌన్సిలింగ్‌ ముగిసిన తరువాత మిగిలి ఉన్న స్థానాల నుంచి బదిలీకి ఎంచు కోవాల్సి ఉంటుంది. ఈ షరతును ఉపాధ్యాయ సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. పదోన్నతితో పాటే బదిలీ స్థానాన్ని కూడా ఒకేసారి ఇవ్వకుంటే సంబంధిత టీచర్లకు తీవ్రనష్టం కలుగుతుందని వాదిస్తున్నాయి. 


Updated Date - 2020-10-20T06:53:03+05:30 IST