వైరల్ వీడియో.. తిరంగ ర్యాలీలో ఖలీస్థానీల హల్‌చల్!

ABN , First Publish Date - 2021-03-05T06:43:33+05:30 IST

కెనడాలోని భారతీయ సమాజం చేపట్టిన తిరంగ ర్యాలీలో ఖలీస్థాన్ మద్దతుదారులు హల్‌చల్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనపై స్థానిక మేయర్ స్పందిస్తూ

వైరల్ వీడియో.. తిరంగ ర్యాలీలో ఖలీస్థానీల హల్‌చల్!

ఒట్టావా: కెనడాలోని భారతీయ సమాజం చేపట్టిన తిరంగ ర్యాలీలో ఖలీస్థాన్ మద్దతుదారులు హల్‌చల్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనపై స్థానిక మేయర్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. భారత్-కెనడా మధ్య బలమైన సంబంధాలను ఆకాంక్షిస్తూ కెనడాలోని భారతీయులు బ్రాంప్టన్‌లో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించింది. పదుల సంఖ్యలో భారతీయ ప్రవాసులు తమ వాహనాల్లో భారత జాతీయ జెండాతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు ఖలీస్థాన్ వేర్పాటు వాదులు వారిని అడ్డగించి హల్‌చల్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విడియోలోని దృశ్యాల ప్రకారం.. కొందరు ఖలీస్థాన్ వేర్పాటు వాదులు ప్రవాస భారతీయులతో దురుసుగా ప్రవర్తించారు. కాగా.. దీనిపై బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ వాల్టర్ బ్రౌన్ స్పందించారు. ఖలీస్థాన్ వేర్పాటు వాదుల వైఖరి ఆయన  ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా కొందరు ప్రవాస భారతీయులు కొద్ది రోజుల క్రితం తిరంగ ర్యాలీ చేపట్టిన విషయం చేపట్టారు. ఈ క్రమంలో ఖలీస్థానీల నుంచి తమకు బెదిరింపులు వచ్చినట్టు పేర్కొన్న విషయం తెలిసిందే. 



Updated Date - 2021-03-05T06:43:33+05:30 IST