Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 18 Aug 2022 10:55:32 IST

Project K : ఇది కూడా రెండు భాగాలా?

twitter-iconwatsapp-iconfb-icon

ఒక సినిమాకి సీక్వెల్ తీయడం వేరు, ఒకే సినిమాని రెండు భాగాలుగా విడగొట్టడం వేరు. ఈ రెండూ ప్రస్తుతం అన్ని భాషల్లోనూ ట్రెండ్‌గా మారాయి. ‘బాహుబలి’ (Bahubali) చిత్రంతో రెండు భాగాల సంప్రదాయం మొదలైంది. ఆ తర్వాత ‘కేజీఎఫ్ (KGF), పుష్ప (Pushpa)’ దాన్ని కొనసాగించాయి. ఇప్పుడు తమిళంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ (Ponniyan Selvan) కూడా రెండు భాగాలుగా వస్తోంది. అలాగే.. మలయాళంలో మోహన్ లాల్ , జీతు జోసెఫ్ కాంబినేషన్ లో ‘రామ్’ (Ram) అనే థ్రిల్లర్ మూవీ కూడా రెండు భాగాలుగా వస్తోంది. ప్రభాస్ (Prabhas) ‘సలార్’ కూడా రెండు భాగాలు అంటూ ప్రచారం జరిగింది కానీ.. రిలీజ్ డేట్ ప్రకటన రోజున దానికి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. ఇక ఈ లిస్ట్ లోకి మరో సినిమా కూడా వచ్చి చేరుతోందని సమాచారం. ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్, నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ (Project K). 

వైజయంతి మూవీస్ నిర్మాణంలో దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న క్రేజీ మూవీ ‘ప్రాజెక్ట్ కె’. కథా పరంగా దీనికి స్పాన్ ఎక్కవ. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి ఎన్ని భాగాలైనా తీసుకోవచ్చు. పార్ట్ 2కి సంబంధించిన బేస్ ‘ప్రాజెక్ట్ కె’ క్లైమాక్స్‌లో కనిపించబోతోందని తెలుస్తోంది. మొదటి భాగంలోని కొన్ని లింకులకు, కొన్ని ప్రశ్నలకు సమాధానం పార్ట్ 2లో తెలుస్తుందని, అవే పాత్రలు, అదే నేపథ్యం కొనసాగినా, కొనసాగకపోయినా.. ఈ కథకు మాత్రం రెండో భాగం తప్పకుండా ఉంటుందని ఇన్‌సైడ్ వర్గాల టాక్. ఇదే జరిగితే పార్ట్ 2 పరంపరలో ప్రభాస్ చేయబోతున్న రెండో సినిమా కాబోతోంది. 

ఇటీవల ఒక టీవీ షోలో ‘ప్రాజెక్ట్ కె’ చిత్ర నిర్మాత సి. అశ్వనీదత్ (C. AShwani Datt).. చిత్రం గురించి అనేక విషయాలు వెల్లడించారు కానీ.. రెండు భాగాల విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. బహుశా ఆ సినిమా క్లైమాక్స్‌లో దానికి క్లూ ఇచ్చి అభిమానుల్ని సర్ ప్రైజ్ చేయాలనుకుంటున్నారేమో. ఏది ఏమైనప్పటికీ.. ‘ప్రాజెక్ట్ కె’ లాంటి వైవిధ్యమైన కథాంశం కలిగిన చిత్రానికి రెండో భాగం రానుండడం అభిమానుల్లో ఆసక్తిగా మారింది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే (Deepika Padukone) కథానాయికగా నటిస్తుండగా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitab Bachan) కీలక పాత్ర చేస్తున్నారు. మరి ఈ సినిమా నిజంగానే రెండు భాగాలుగా వస్తుందేమో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement