Abn logo
Jun 3 2020 @ 05:44AM

పెన్‌గంగా ప్రాజెక్టు రైతులకు వరం లాంటిది : ఎమ్మెల్యే

భీంపూర్‌, జూన్‌ 2: పెన్‌గంగా ప్రాజెక్టు భీంపూర్‌ మండల రైతులకు వరమని బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌బాపూరావు అన్నారు. మంగళవారం ఆయన ఇరిగేషన్‌ అధికారులు, ప్రజా ప్రతినిధుల తో కలిసి పిప్పల్‌కోటి శివారులో ప్రాజెక్టు సంబంధిత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తయితే కనీసం 51 వేల విస్తీర్ణంలో భూములు సస్యశ్యామ లం అవుతాయన్నారు.


రూ.368 కోట్ల అంచనా వ్యయంతో ప్రసు ్థతం పిప్పల్‌కోటి రిజర్వాయర్‌ పనులు మొదలయ్యాయని, 215 కోట్ల రూపాయలతో అంచనాతో సీఎం కేసీఆర్‌ మంజూరు చేసి న గోమూత్రి రిజర్వాయర్‌ పనులకు త్వరలో టెండర్లు పిలుస్తార ని వెల్లడించారు. చెరువులు, ప్రాజెక్టులు రైతుబంధు పథకాలతో తెలంగాణ రాష్ట్రం పాడి పంటలలో వర్ధిలుతుందని పేర్కొన్నా రు. రాష్ట్ర ప్రజలంతా అవతరణ దినోత్సవాన్ని పండుగ తీరు జరుపుకుంటున్నారు. తర్వాత ఎమ్మెల్యే తాంసి(కె) సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు జడ్పీటీసీ కుమ్ర సుధాకర్‌, ఎంపీపీ కుడిమెత రత్నప్రభా సంతోష్‌, వైస్‌ ఎంపీపీ గడ్డంలస్మన్న, పిప్పల్‌కోటి, తాంసి(కె) సర్పంచ్‌లు కేమ కల్యాణి గంగయ్య, సయ్యద్‌ కరీం, టీఆర్‌ఎస్‌ కన్వీనర్‌ మేకల నాగయ్య, ప్రధాన కార్యదర్శి షేక్‌ అఫ్రోజ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement