Abn logo
Sep 19 2020 @ 07:48AM

యూఎస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాదర్ కన్నుమూత

Kaakateeya

వాషింగ్టన్ (అమెరికా): అమెరికా సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాదర్ గిన్సు‌బర్గ్ (87) కేన్సరుతో కన్నుమూశారు. జస్టిస్ రూత్ బాదర్ అమెరికా అత్యున్నత న్యాయస్థానం రెండవ మహిళా న్యాయమూర్తిగా పనిచేశారు. రూత్ బాదర్ మహిళల హక్కుల కోసం పోరాడారు. 1933వ సంవత్సరం మార్చి 15న రష్యన్ యూదు వలసదారుల కుటుంబంలో జన్మించిన రూత్ బాదర్ యుక్తవయసులో ఉన్నపుడే ఆమె తల్లి కేన్సర్ బారిన పడ్డారు. ఈమె కార్నెల్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ లా స్కూలులో చదువుకున్నారు. న్యాయవాదిగా కెరియర్ ప్రారంభించిన రూత్ లైంగిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఫెడరల్ అప్పీలు కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన గిన్సు బర్గ్ సుప్రీంకోర్టుకు నామినేట్ అయ్యారు. 

Advertisement
Advertisement
Advertisement