Abn logo
Jul 25 2021 @ 23:32PM

భవన నిర్మాణాల్లో ప్రగతి సాధించాలి

మాట్లాడుతున్న కలెక్టర్‌ లఠ్కర్‌

  కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూలై 25:  ప్రభుత్వ భవన నిర్మాణాల్లో ప్రగతి సా ధించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో వివిధ మండలాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. పోలాకి, పొందూరు, మెళియాపుట్టి, సరుబుజ్జిలి, కోటబొమ్మాళి, రణస్థలం, కవిటి, పలాస, ఆమదాలవలస మండలాలు భవన నిర్మాణాల్లో చివరి స్థా నంలో ఉన్నాయన్నారు.  పనులు వేగవంతం చేయాలని,  స్థల సమస్య ఉంటే తక్షణం పరిష్కరించుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ఇసుకను ఎడ్ల బండ్ల ద్వారా తెప్పించుకోవాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రగతి మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణం కూడా చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాసులు, జడ్పీ సీఈవో లక్ష్మీపతి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ బ్రహ్మయ్య, డ్వామా పీడీ కూర్మారావు, ఎంపీడీవోలు, ఇంజనీర్లు పాల్గొన్నారు.