నేటి నుంచి ప్రగతిబాట

ABN , First Publish Date - 2022-06-03T05:29:43+05:30 IST

పట్టణాల్లో నేటి నుంచి 18వ తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేశారు.

నేటి నుంచి ప్రగతిబాట
గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల్లో మరోసారి ప్రగతిబాటకు శ్రీకారం చుట్టబోతున్నారు. గ్రామాలు,


  • 16 రోజుల పాటు కొనసాగనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు

పట్టణాల్లో నేటి నుంచి 18వ తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. 

వికారాబాద్‌, జూన్‌2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి పంచాయతీ పరిధిలో సర్పంచ్‌ అధ్యక్షతన ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి, విద్యుత్‌ లైన్‌మెన్‌, మిషన్‌ భగీరథ టెక్నీషియన్‌లతో పల్లె ప్రగతి కమిటీలు ఏర్పాటు చేశారు. అదే మునిసిపాలిటీల్లోనైతే వార్డు కౌన్సిలర్ల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటయ్యాయి.   పల్లె ప్రగతి కార్యక్రమంలో అన్ని వైకుంఠధామాలకు మిషన్‌ భగీరథ ద్వారా నీటి సౌకర్యం కల్పించి వినియోగంలోకి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నారు. పల్లె ప్రగతి గ్రామాభివృద్ధి సమాచారం ప్రజలకు కనిపించే విధంగా నెలకోసారి అప్డేట్‌ చేసే విధంగా బోర్టులు ఏర్పాటు చేయనున్నారు.  బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ఇంకా స్థలాలు గుర్తించని చోట ఈ కార్యక్రమంలో గుర్తించి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గతంలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో సరైన ఫలితాలు సాధించని గ్రామాలపైన ప్రత్యేక దృష్టి సారించి ఇతర పంచాయతీల మాదిరిగా ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ప్రభుత్వం జారీ చేసిన పల్లె ప్రగతి మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులను పరిశీలించి పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతిరోజు పారిశుద్ధ్యం, పరిశుభ్రత, పచ్చదనం, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజారోగ్యం, సామాజిక భద్రత తదితర అంశాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, అదే మునిసిపాలిటీల్లోనైతే మునిసిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొననున్నారు. స్థాయి సంఘాల సభ్యులు, కో ఆప్షన్‌ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, గ్రామస్థాయి అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, ఎన్‌జీవోలు, యువకులతో పాటు గ్రామ, పట్టణ ప్రజలను కూడా భాగస్వాములయ్యేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి పంచాయతీ పరిధిలో సర్పంచ్‌ అధ్యక్షతన ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి, విద్యుత్‌ లైన్‌మెన్‌, మిషన్‌ భగీరథ టెక్నీషియన్‌లతో పల్లె ప్రగతి కమిటీలు ఏర్పాటు చేశారు. అదే మునిసిపాలిటీల్లోనైతే వార్డు కౌన్సిలర్ల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటయ్యాయి. 

పర్యవేక్షణకు ప్రత్యేకాధికారుల నియామకం

పల్లె ప్రగతి కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షించేందుకు నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రత్యేకాధికారులను నియమించారు.  వికారాబాద్‌ నియోజకవర్గానికి ఆర్డీవో విజయకుమారి, పరిగి నియోజకవర్గం జడ్పీ సీఈవో జానకిరెడ్డి, తాండూరు నియోజకవర్గం ఆర్డీవో అశోక్‌కుమార్‌, కొడంగల్‌ నియోజకవర్గం డీఆర్‌డీవో ఎంఏ కృష్ణన్‌, చేవెళ్ల నియోజకవర్గంలో డీపీవో మల్లారెడ్డిలు పర్యవేక్షించనున్నారు. వికారాబాద్‌ మండలానికి జడ్పీ డిప్యూటీ సీఈవో సుభాషిణి, ధారూరుకు డీఎస్సీడీవో మల్లేశం, కోట్‌పల్లికి డీసీఎ్‌సవో రాజేశ్వర్‌ప్రసాద్‌, బంట్వారం సెర్ప్‌ అదనపు డీఆర్‌డీవో నర్సింహులు, మర్పల్లికి డీఎల్‌పీవో అనిత, మోమిన్‌పేట్‌కు డీఎ్‌ఫవో దుర్గాప్రసాద్‌లను నియమించారు. పరిగి మండలానికి బీసీడీవో ఉపేందర్‌, చౌడాపూర్‌కు డీజీడబ్ల్యువో దీపారెడ్డి, పూడూరుకు డీఎండబ్ల్యువో సుధారాణి, దోమకు డీటీడబ్ల్యువో కోటాజీ, కులకచర్ల మండలానికి డీవైఎ్‌సవో హనుమంతరావులను నియమించారు. తాండూరుకు డీహెచ్‌ఎ్‌సవో చక్రపాణి, యాలాల్‌కు ఎస్‌అండ్‌ఎల్‌ఆర్‌ ఏడీ రాంరెడ్డి, పెద్దేముల్‌కు ఆడిట్‌ ఽఅధికారి వీరభద్రరావు, బషీరాబాద్‌కు డీఆర్‌డీఏ అదనపు పీడీ స్టీవెన్‌నీల్‌, కొడంగల్‌కు ఏపీడీ సరళ, దౌల్తాబాద్‌కు కార్మికశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు, బొంరా్‌సపేట్‌కు డీఎల్‌పీవో రాజేంద్రప్రసాద్‌, నవాబ్‌పేట్‌కు డీడబ్ల్యువో లలితకుమారి నియమితులయ్యారు. వికారాబాద్‌ మునిసిపాలిటీకి డీఎ్‌ఫవో వేణుమాధవరావు, తాండూరు మునిసిపాలిటీకి పరిశ్రమల శాఖ జీఎం వినయ్‌కుమార్‌, పరిగి మునిసిపాలిటీకి పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, కొడంగల్‌ మునిసిపాలిటీకి సివిల్‌ సప్లయీస్‌ డీఎం విమలను నియమించారు.

ఏరోజు ఏ కార్యక్రమం నిర్వహిస్తారంటే..

ఈనెల 3వ తేదీన పంచాయతీలు, మునిసిపాలిటీల్లో పాదయాత్రలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సమస్యలు గుర్తించి సంబంధిత  అధికారుల దృష్టికి తీసుకు వస్తారు. అనంతరం గ్రామ, వార్డు సభలు నిర్వహించి సీఎం సందేశం చదివి వినిపిస్తారు. ఆ తరువాత 5వ విడత పల్లె ప్రగతి ప్రణాళికలు తయారు చేస్తారు. ఈ సందర్భంగా పంచాయతీ ఆదాయ వ్యయాలు, గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి విజయాల గురించి వివరిస్తారు. మ్యాజిక్‌ ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహించాల్సి ఉంటుంది. 4న పవర్‌ డే సందర్భంగా గుర్తించిన విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. అంతే కాకుండా గ్రామీణ క్రీడా స్థలాలు గుర్తించి పనులు ప్రారంభించనున్నారు. 5న శ్రమదానం ద్వారా పరిసరాలు పరిశుభ్రం చేయడమే కాకుండా తడి, పొడి చెత్త సేకరణపై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించాల్సి ఉంటుంది.  6న అన్ని ప్రభుత్వ భవనాలు, పబ్లిక్‌ ప్రదేశాలను సందర్శించి సమస్యలు గుర్తిస్తారు. 7న రోడ్లు, వీధులు, మురికి కాలువలు శుభ్రపరుస్తారు. ఖాళీ ప్రదేశాల్లోని చెత్తను తొలగిస్తారు. 8న అంతర్గత రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు గుంతలు తవ్విస్తారు. 9న రాబోయే హరితహారంలో ఎవెన్యూ, కమ్యూనిటీ ప్లాంటేషన్‌లో మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలు గుర్తిస్తారు. 10న మొక్కలు నాటడం ప్రారంభించడంతో పాటు లక్ష్యానికి అనుగుణంగా హరిత ప్రణాళికలను రూపొందించాలి. 11న ఓహెచ్‌ఎ్‌సఆర్‌, జీఎల్‌ఎ్‌సఆర్‌ ట్యాంకులు శుభ్రపరచాలి, పైప్‌లైన్‌ లీకేజీలు అరికట్టడం, పిట్‌ట్యాప్స్‌ మూసివేసే పనులు చేయాల్సి ఉంటుంది. 12న పాడుబడిన బావులు, నిరుపయోగమైన బోరు బావులను పూడ్చివేయాలి. 13న డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠధామాలను సందర్శించాలి. ట్రాలీలో వేర్వేరు కంపార్ట్‌మెంట్లలో తడి చెత్త, పొడి చెత్త సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించాలి. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్‌ తయారీ, దానిని వినియోగించుకోవడం, విక్రయించడంపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 14న వైకుంఠధామానికి విద్యుత్‌, నీరు, మరుగుదొడ్ల సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవడం, చుట్టూ బయో ఫెన్సింగ్‌ వేసేలా చర్యలు తీసుకోవాలి. 15న పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ పలె ్ల ప్రకృతి వనాల్లో మొక్కలు నాటాలి శాశ్వత నీటి సదుపాయం కల్పించాలి. 16న ప్రతి ఇంటిని సందర్శించి మరుగుదొడ్లు వినియోగించుకునేలా, మ్యాజిక్‌ సోక్‌ పిట్‌, కమ్యూనిటీ సోక్‌ పిట్‌ నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. 17న ప్రతి పంచాయతీ పరిధిలో గ్రామీణ క్రీడాప్రాంగణం ప్రారంభించాలి. 18న గ్రామ సభ నిర్వహించి ఆ గ్రామం ఓడీఎఫ్‌ ప్లస్‌ మోడల్‌ అర్హత సాధిస్తే ఆ విషయం గ్రామ సభలో ప్రకటించాలి. అత్యుత్తమ సేవలు అందించిన అధికారులు, అనధికారులను సన్మానించాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం సూచించింది.

Updated Date - 2022-06-03T05:29:43+05:30 IST