లాభసాటి పంటలు సాగు చేయాలి : ఐకే రెడ్డి

ABN , First Publish Date - 2021-06-18T07:05:53+05:30 IST

ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ రైతులు లాభసాటి పంటలు సాగుచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

లాభసాటి పంటలు సాగు చేయాలి : ఐకే రెడ్డి
సదస్సులో రైతుల ఒప్పంద పత్రాలను అందజేస్తున్న మంత్రి ఐకేరెడ్డి

నిర్మల్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ రైతులు లాభసాటి పంటలు సాగుచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక దివ్యగార్డెన్‌లో వానాకాలం (ఖరీఫ్‌) పంటలసాగు, ఆయిల్‌ఫామ్‌ పంట సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్‌ ముషా రఫ్‌ ఫారూఖీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డారు. ఆధునిక, సాంకేతిక వ్యవసాయ పద్ధతులతో లాభసాటి పంటలు సాగు చేస్తూ రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. సాగువిధానంలో నూతన పద్ధ తులు పాటించి పంట దిగుబడులను పెంచాలని, వ్యవసాయశాఖ అధి కా రులకు సూచించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చే పంట వివరాలను వివరించారు. మార్కెట్‌లో ఆయిల్‌ పామ్‌ సీడ్‌కు డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగువిస్తీర్ణం పెంచుకోవాలని సూ చించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆనేక పథకాలను అమలు చేస్తుం దని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.7,750 కోట్లు పంట పెట్టుబడి సహాయాన్ని రైతులఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. వానాకాలంలో ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు సూచించిన పంటలుసాగు చేసుకోవాలని, అధిక దిగుబడులు సాధించాలని వివరించారు. జిల్లాలో 1.92  మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని పండించగా.. రైతులకు 350 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. అనంతరం సోన్‌ మండలానికి చెందిన మహేందర్‌రెడ్డి 5 ఎకరాలలో ఆయిల్‌ ఫామ్‌ పండిస్తానని ఎఫ్‌జీవీ సంస్థతో ఒప్పందం కుదుర్చు కోగా ఆయనకు ఒప్పందపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరి షత్‌ చైర్మన్‌ పర్స న్‌ కొరిపెల్లి విజయలక్ష్మి రాంకిషన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షు డు వెంకట్‌ రాంరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్మదా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధి కారి వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శరత్‌కుమార్‌, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

డబుల్‌ బెడ్‌ రూమ్‌ల నిర్మాణానికి మంత్రి భూమిపూజ 

పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ డబుల్‌బెడ్‌ రూమ్‌ పథకం ప్రవేశపెట్టారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌ పట్టణ వాసుల కోసం సిద్దా పూర్‌ గ్రామంలో గురువారం రోజున రూ. 31.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 600డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి భూమి పూ జ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు లేని పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు అందజేస్తామన్నారు. రాష్ట్రంలోని పేద, బడుగు, బల హీన, మైనార్టీ, ఇలా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. త్వర లోనే అర్హులైన వారికి ప్రభుత్వం కొత్తరేషన్‌ కార్డులు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. 


Updated Date - 2021-06-18T07:05:53+05:30 IST