చైనా అధ్యక్షుడికి వ్యతిరేకంగా వ్యాసం రాసినందుకు..

ABN , First Publish Date - 2020-07-07T01:24:26+05:30 IST

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా వ్యాసం రాసిన లా ప్రొఫెసర్‌ను అధికారులు

చైనా అధ్యక్షుడికి వ్యతిరేకంగా వ్యాసం రాసినందుకు..

బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా వ్యాసం రాసినందుకు చైనాలోని లా ప్రొఫెసర్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. జు జాన్‌గ్రూన్ అనే లా ఫ్రొఫెసర్‌ ఇంటికి సోమవారం 20 మంది అధికారులు వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. జు జాన్‌గ్రూన్ ప్రభుత్వ మోసాల గురించి, అధ్యక్షుడు జిన్‌పింగ్ కరోనా వ్యాప్తి గురించి తెలియకుండా సెన్సార్‌షిప్ విధించడంపై ఫిబ్రవరిలో వ్యాసం రాశారు. చైనాలోని నాయకత్వ వ్యవస్థ.. పాలన యొక్క నిర్మాణాన్ని నాశనం చేస్తోందంటూ ఆయన తన వ్యాసంలో రాసుకొచ్చారు. చైనాకు కేవలం ఒక వ్యక్తి మాత్రమే నాయకత్వం వహిస్తున్నాడని, ఒక పద్దతి లేకుండా పాలన అందిస్తున్నట్టు రాసుకొచ్చారు. అంతేకాకుండా అధికారంతో ఆడుకోవడంలో ఆ వ్యక్తి నైపుణ్యం పొందాడంటూ జిన్‌పింగ్‌ను విమర్శిస్తూ వ్యాసంలో రాశారు. ఇదిలా ఉంటే.. జు జాన్‌గ్రూన్ గతేడాది చెంగ్‌డూ నగరంలో అనేక మంది పండితులను కలిశారు. ఈ కారణంగా కూడా ఆయనను అరెస్ట్ చేసి ఉండొచ్చని జాన్‌గ్రూన్ స్నేహితులు చెబుతున్నారు. కాగా.. జు జాన్‌గ్రూన్ చైనాలోని సింగ్వా యూనివర్శిటిలో లా ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గతంలోనూ ఈయన చాలా సార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు విమర్శలు చేశారు.

Updated Date - 2020-07-07T01:24:26+05:30 IST