40ఏళ్లుగా ఆయన చెప్పినట్టే.. ఈసారి అమెరికా ప్రెసిడెంట్ ఎవరంటే!

ABN , First Publish Date - 2020-08-14T03:48:02+05:30 IST

అమెరికాలో అధ్యక్ష పదవి ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో అధ్యక్ష పదవిని తిరిగి చేపట్టడానికి డొనాల్డ్ ట్రంప్.. విశ్వప్రయత్నా

40ఏళ్లుగా ఆయన చెప్పినట్టే.. ఈసారి అమెరికా ప్రెసిడెంట్ ఎవరంటే!

వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష పదవి ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో అధ్యక్ష పదవిని తిరిగి చేపట్టడానికి డొనాల్డ్ ట్రంప్.. విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు డెమొక్రటిక్ అభ్యర్థి.. జో బైడెన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాగా.. ఎన్నికల్లో  గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రొఫెసర్.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేదెవరో తేల్చి చెప్పారు. వివరాల్లోకి వెళితే.. అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలన్ లిచ్ట్మాన్.. గత 40 ఏళ్లుగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఎవరిదో కచ్చితంగా చెబుతున్నారు. ఇన్నేళ్లలో ఆయన వేసిన అంచనా ఎప్పుడూ తప్పలేదు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలవనున్నారో తాజాగా ప్రకటించారు. 13 సూత్రాల ఆధారంగా.. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి విజయం సాధించనున్నట్లు స్పష్టం చేశారు. 2016 ఎన్నికల సమయంలో  కూడా హిల్లరి క్లింటన్‌పై ట్రంప్ విజయం సాధిస్తారని ఈయన ప్రకటించారు. అలన్ లిచ్ట్మాన్ చెప్పినట్టుగానే.. 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి.. అధికారం చేపట్టారు. కాగా.. అలన్ లిచ్ట్మాన్ తాజా ప్రకటనతో.. రిపబ్లికన్ పార్టీ నేతల్లో కలవరం మొదలైంది.  


Updated Date - 2020-08-14T03:48:02+05:30 IST