ఆశయాల సాధనే నిజమైన నివాళి

ABN , First Publish Date - 2021-06-22T05:11:52+05:30 IST

ఆచార్య జయశంకర్‌ ఆశయసాధనే ఆయనకు నిజమైన నివాళి అని ఎమ్మెల్యే బండ్లకృష్ణ మోహన్‌ రెడ్డి అన్నారు.

ఆశయాల సాధనే నిజమైన నివాళి
జయశంకర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే బండ్లకృష్ణ మోహన్‌ రెడ్డి

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- జిల్లా వ్యాప్తంగా జయశంకర్‌ సర్‌ వర్ధంతి

- ఘనంగా నివాళి అర్పించిన ఎమ్మెల్యేలు, వివిధ సంఘాల నాయకులు

గద్వాల టౌన్‌, జూన్‌ 21 : ఆచార్య జయశంకర్‌ ఆశయసాధనే ఆయనకు నిజమైన నివాళి అని ఎమ్మెల్యే బండ్లకృష్ణ మోహన్‌ రెడ్డి అన్నారు. జయశంకర్‌ సార్‌ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, వైస్‌ చైర్మన్‌ బాబర్‌, వినియోగ దారుల ఫోరం రాష్ట్ర చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, ఎంపీపీలు ప్రతాప్‌ గౌడ్‌, విజయ్‌కుమార్‌, జడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్‌ రెడ్డి, రాజశేఖర్‌, కౌన్సిలర్లు మురళి, శ్రీను, మహేశ్‌, కృష్ణ, నాయకులు విక్రమ్‌సింహారెడ్డి, కోటేశ్‌, గోవిందు, ధర్మనాయుడు పాల్గొన్నారు. 


మహోన్నతుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌

ఉండవల్లి : తెలంగాణవాదాన్ని ఎలుగెత్తి చాటి, ఉద్యమ రూపంలో తారాస్థాయికి తీసుకెళ్ళిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. జయ శంకర్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం అలంపూర్‌ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.  కార్యక్రమంలో అలంపూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ షాబాద రవి, కో ఆప్షన్‌ మెంబర్‌ అల్లాబకాష్‌, షఫీ అహ్మద్‌ పాల్గొన్నారు.

- ఆచార్య జయశంకర్‌ వర్ధంతిని పురస్కరించుకుని దివంగత నాయకుడికి విశ్వకర్మ ఐక్య సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. గద్వాల పట్టణంలోని సంఘం కార్యాలయంలో ఆచార్య జయశంకర్‌ చిత్రపటానికి పూల మాల వేసి జిల్లా అధ్యక్షుడు కరాటే సత్యం పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరసిం హాచారి, కోశాధికారి రాఘవేంద్రాచారి, నాగరాజు, కేశ వాచారి, వెంకటేశ్వరాచారి, రమేశ్‌ చారి తదితరులు పాల్గొన్నారు. 


- ఆచార్య జయశంకర్‌కు తెలంగాణ జనసమితి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణం లోని పార్టీ కార్యాలయంలో దివంగత నాయకుడి చిత్రపటానికి జిల్లా కన్వీనర్‌ ఆలూరు ప్రకాశ్‌ గౌడ్‌ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్‌, గోపాల్‌ రావు, వీరభద్రప్ప, హుస్సేన్‌ తదితరులున్నారు. 

Updated Date - 2021-06-22T05:11:52+05:30 IST