Abn logo
Jun 22 2021 @ 01:09AM

ప్రొఫెసర్‌ జయశంకర్‌కు ఘన నివాళి

సిరిసిల్లలో జయశంకర్‌ చిత్ర పటం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల, జూన్‌ 21 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణ సిద్ధాంతకర్త అచార్య కొత్తపల్లి జయశంకర్‌ వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పర్యటనకు వచ్చిన పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.    మున్సిపల్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అరవింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, నాప్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌ హెగ్డే,  ముస్తాబాద్‌ ఎంపీపీ శరత్‌రావు, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్‌ గోపాల్‌రావు ప్రొఫెసర్‌ జయశంకర్‌కు నివాళి తెలిపారు. 

 తెలంగాణ టీచర్స్‌, లెక్చరర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో 

సిరిసిల్ల టౌన్‌:  తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా తెలంగాణ టీచర్స్‌, లెక్చరర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని పాతబస్టాండ్‌ సమీపంలో తెలంగాణ అమరవీరుల  స్తూపం వద్ద జయశంకర్‌ చిత్రపటానికి  పూలమాల వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ టీచర్స్‌, లెక్చరర్స్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు తోపుల శ్రీనివాస్‌, ఫోరం ఇంజనీరింగ్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపెల్లి రాజేందర్‌, నాయకులు జగదీశ్వర్‌, మధుసూదన్‌,  శశికుమార్‌  పాల్గొన్నారు.

 సిరిసిల్ల పట్టణంలోని గాంధీచౌక్‌ వద్ద సోమవారం విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ వర్ధంతిని నిర్వహించారు. జయశంకర్‌ చిత్రపటానికి విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎస్టీయూ ఆధ్వర్యంలో..

 సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయ సాధనకు ఎస్‌టీయూ కృషి చేస్తుందని సంఘం జిల్లా అధ్యక్షుడు బోయన్నగారి నారాయణ అన్నారు. సోమ వారం సిరిసిల్లలోని ఎస్‌టీయూ కార్యాలయంలో  ప్రొఫె సర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా, మండలాల బాధ్యులు కోటగిరి ఆంజనేయులు, వడ్లూరి రమేష్‌, సుల్తాన్‌రాజు, బూట్ల శ్రీనివాస్‌, ప్రకాశ్‌ పాల్గొన్నారు.