నా జీతం, పీఎఫ్ భార్యకు చెల్లించండంటూ ప్రొఫెసర్ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-02-12T12:52:27+05:30 IST

9 నెలలుగా జీతం చెల్లించలేదనే వేదనతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంఢియా పట్టణంలో జరిగింది....

నా జీతం, పీఎఫ్ భార్యకు చెల్లించండంటూ ప్రొఫెసర్ ఆత్మహత్య

ఉమారియా (మధ్యప్రదేశ్): 9 నెలలుగా జీతం చెల్లించలేదనే వేదనతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంఢియా పట్టణంలో జరిగింది. చంఢియా పట్టణంలోని కళాశాలలో సంజయ్ కుమార్ ప్రొఫెసరుగా పనిచేసేవాడు. తనకు 9 నెలలుగా జీతం ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ‘‘నాకు రావాల్సిన జీతం, ప్రావిడెంట్ ఫండ్ భార్యకు చెల్లించండి’’ అంటూ సంజయ్ కుమార్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. 9 నెలలుగా జీతం ఇవ్వకుంటే తామెలా జీవించాలని మృతుడి భార్య ప్రశ్నించారు. ఫీజు చెల్లించక పోవడంతో తన పిల్లల్ని స్కూలుకు కూడా పంపించడం లేదని భార్య ఆవేదనగా చెప్పారు.

Updated Date - 2020-02-12T12:52:27+05:30 IST