ఇంటర్‌ విద్యార్థులకు ప్రొఫెషనల్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-08-15T10:01:20+05:30 IST

బాల్యం నుంచి కౌమారదశకు చేరే సమయంలో విద్యార్థులు ఇంటర్‌లో..

ఇంటర్‌ విద్యార్థులకు ప్రొఫెషనల్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): బాల్యం నుంచి కౌమారదశకు చేరే సమయంలో విద్యార్థులు ఇంటర్‌లో ఉంటారని, ఈ క్రమంలో ఏర్పడే శారీరక, మానసిక సవాళ్లను ఎదుర్కొనేలా, విద్యలో ఉన్నత శిఖరాలు అందుకునేలా వారిని తీర్చిదిద్దాల్సిన అవసరం అధ్యాపకులదని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ అన్నారు.


దీనికోసమే విద్యార్థులకు ప్రొఫెషనల్‌ కౌన్సెలింగ్‌ విధానాన్ని అమల్లోకి  తెస్తున్నామని వివరించారు. ఎంసీఆర్‌హెచ్చార్డీ ఆధ్వర్యంలో ఇంటర్‌ విద్య సహకారంతో 2500 మంది జూనియర్‌ లెక్చరర్లకు వర్చువల్‌ మోడ్‌, ఆన్‌లైన్‌ మోడ్‌ ద్వారా కౌన్సెలర్లుగా శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఇండియన్‌ హెల్త్‌ అసోసియేషన్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సె్‌స(టి్‌స)కు చెందిన నిపుణులు శిక్షణ ఇచ్చారు.  

Updated Date - 2020-08-15T10:01:20+05:30 IST